హాకీ ప్రపంచకప్‌: పాక్‌తో పోరు.. భారత్‌కు ‘డూ ఆర్ డై’ | Hockey World Cup 2026 IND Vs PAK, India Must Win Do-or-Die Will Face Pakistan, High-Stakes Clash For Knockout Qualification | Sakshi
Sakshi News home page

హాకీ ప్రపంచకప్‌: పాక్‌తో పోరు.. భారత్‌కు ‘డూ ఆర్ డై’

Aug 19 2026 8:19 AM | Updated on Aug 19 2026 9:45 AM

Hockey World Cup 2026: India Must Win-Do-or-Die-Will-Face Pakistan

Photo Credit: Twitter

పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. పూల్‌-డిలో భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు  భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. ఇంగ్లండ్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. దీంతో పాక్‌తో మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డైగా మారింది. పాక్‌పై మ్యాచ్ గెలవడం లేదంటే డ్రా చేసుకుంటేనే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ పాక్ చేతిలో ఓడితే మాత్రం ఇంటిబాట పట్టాల్సిందే. 

ఇక చివరిసారి 2016లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు తలపడగా, పాకిస్తాన్ విజయం సాధించింది. ప్రపంచకప్‌లో చివరిసారి ఇరుజట్ల మధ్య 2010లో మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో మాత్రం భారత్ 4-1 తేడాతో నెగ్గింది. మ్యాచ్‌కు వేదిక కానున్న వాగ్నర్ స్టేడియం సామర్థ్యం పదివేలు కాగా, టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. 10వేల మంది సమక్షంలో భారత్ గెలుస్తుందా లేక నిరాశపరుస్తుందా అనేది చూడాలి.

తెరపైకి హ్యాండ్‌షేక్ వివాదం
భారత్‌, పాక్ మధ్య ఎలాంటి మ్యాచ్ జరిగినా అది ఆసక్తికరమే. ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే రెండు దేశాల అభిమానులతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అయితే పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

అప్పటినుంచి ఎలాంటి మేజర్ టోర్నీలు జరిగినా, అందులో భారత్‌, పాక్ తలపడిన ప్రతీసారి మన ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. పురుషుల, మహిళల క్రికెట్‌లో నో హ్యాండ్‌షేక్ కొనసాగుతూ వస్తోంది. తాజాగా హాకీ ప్రపంచకప్‌లో దాయాదుల సమరం సందర్భంగా హ్యాండ్‌షేక్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  కానీ హాకీలో మాత్రం హ్యాండ్‌షేక్ వివాదం లేదు. 

ఎందుకంటే తాము క్రికెట్ మార్గాన్ని అనుసరించబోమని, దానికి బదులుగా ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) జారీ చేసిన మార్గదర్శకాలకే కట్టుబడి ఉంటామని హాకీ ఇండియా గత ఏడాది నవంబర్‌లో తేల్చి చెప్పింది. ఈసారి ప్రపంచకప్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తారా లేదా అనేది పక్కనబెడితే, ఇటీవలే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ సహా జూనియర్ స్థాయిలో భారత్, పాక్ తలపడ్డ ప్రతీసారి ఇరుజట్ల ఆటగాళ్లు హై-ఫై ఇచ్చుకోవడం గమనించాం.

భారత్‌దే పైచేయి
ఇక రెండు దేశాల మధ్య వైరం పక్కనబెడితే, హాకీలో ఇరుజట్ల మధ్య గత రికార్డులు పరిశీలిద్దాం. ఇప్పటివరకు భారత్‌, పాకిస్తాన్‌లు హాకీలో 185 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో భారత్ 73 గెలిస్తే.. పాకిస్తాన్ 84 విజయాలు సాధించగా, మరో 28  మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక హాకీ ప్రపంచకప్‌ల విషయానికి వస్తే.. భారత్ 3-2తో పాక్‌పై పైచేయిలో కొనసాగుతోంది.

Read: లంకతో తొలి టెస్టు.. మంజ్రేకర్‌, మురళీ కార్తిక్ మధ్య వాగ్వాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement