
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆదర్శ్ నారాయణపురం స్పెయిన్ లీగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. స్పెయిన్‌లోని వాలెన్సియా నగరానికి చెందిన సీడీ ఒలింపిక్ డి జటీవా థర్డ్ డివిజన్ క్లబ్ తరఫున 18 ఏళ్ల ఆదర్శ్ బరిలోకి దిగనున్నాడు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్ జరుగుతుంది. ఈనెల 14న ఆదర్శ్ స్పెయిన్‌కు బయలుదేరనున్నాడు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని ఆదర్శ్ మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇటీవల జటీవా క్లబ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆదర్శ్ ఆకట్టుకొని ఈ క్లబ్ జట్టుకు ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment