రవీంద్ర జడేజాPC(IPL/BCCI)
ఐపీఎల్-2022లో సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. బుధవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతులు ఎదుర్కొన్న జడేజా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ధోని సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, ఆ బాధ్యతలను జడేజా చేపట్టాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా జడేజా టోర్నీ మధ్యలోనే ధోనికి మళ్లీ జట్టు పగ్గాలు అప్పగించేశాడు.
సారథ్య బాధ్యతల జడేజా నుంచి తప్పుకున్నప్పటికీ .. బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో జడేజా ఫామ్‌పై సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. జడేజా ఫామ్ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఫ్లెమింగ్ తెలిపాడు.
జడేజా ఫామ్ గురించి పెద్దగా నాకు ఆందోళన లేదు. టీ20 ల్లో ఆడటం అంత సులభం కాదు. అతడు త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను. బ్యాటర్ 5 లేదా 6 స్ధానంలో బ్యాటింగ్ వస్తే.. అతడు సెటిల్ అవ్వడానికి ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి హిట్టింగ్ చేసే క్రమంలో వికెట్ కోల్పోయే అవకాశం ఉంది. కాగా రాబోయే మ్యాచ్‌ల్లో మా బ్యాటింగ్ ఆర్డర్‌పై దృష్టి సారిస్తాం "అని ఆర్‌సీబీతో మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment