మౌంట్‌మంగ్‌నూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు 65 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆజేయ శతకంతో మెరవగా.. అనంతం బౌలింగ్‌లో సిరాజ్, చాహల్, హుడా కివీస్ బ్యాటర్ల భరతం పట్టారు. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం స్పందించాడు. అ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారని హార్దిక్ కొనియాడాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడూతూ.. "బే ఓవల్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కాబట్టి క్రెడిట్ బౌలర్లకే ఇవ్వాలి. ప్రతీ బంతికి వికెట్ తీయకున్నా.. దూకుడుగా బౌలింగ్ చేయడం ముఖ్యం. ఇక ఇప్పటి వరకు నేను చాలా మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేశాను.
ఈ మ్యాచ్‌లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనుకున్నాను. అందుకే దీపక్ చేతికి బంతి ఇచ్చాను. అయితే అన్ని సమయాల్లో ఇది సరైన నిర్ణయం కాదు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్లను మా జట్టులో తయారుచేయాలి అనుకుంటున్నాము" అని పేర్కొన్నాడు.
చదవండి: ఆస్పత్రిలో షాహీన్ ఆఫ్రిది.. ఫోటో షేర్ చేసిన స్పీడ్ స్టర్!
Comments
Please login to add a commentAdd a comment