Ind vs NZ 3rd T20I: New Zealand Opt to Bat | Live Updates and Highlights - Sakshi
Sakshi News home page

IND Vs NZ 3rd T20 : డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మ్యాచ్‌ టై.. సిరీస్‌ భారత్‌ సొంతం

Published Tue, Nov 22 2022 12:11 PM | Last Updated on Tue, Nov 22 2022 4:02 PM

india vs new zealand 3nd t20 live update and highlights - Sakshi

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మ్యాచ్‌ టై
టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య మూడో టి20 టైగా ముగిసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వర్షం అంతరాయం కలిగించే సమయానికి  4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం వర్షం పడే సమయానికి టీమిండియా 75 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. సోధి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజులో దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్యా ఉన్నారు.

23 పరుగులకే మూడు వికెట్లు
టీమిండియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. టిమ్‌ సౌథీ వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి పంత్‌, ఐదో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ పెవిలియన్‌కు చేరారు. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌.. మిల్నే బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.

చెలరేగిన సిరాజ్‌, అర్ష్‌దీప్‌.. న్యూజిలాండ్‌ 160 ఆలౌట్‌
టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌లు చేలరేగడంతో న్యూజిలాండ్‌ 160 పరుగులకు ఆలౌట్‌ అయింది. 130 పరుగులకు రెండు వికెట్లతో పటిష్టంగా కనిపించిన కివీస్‌ చివరి 8 వికెట్లను 30 పరుగుల తేడాతో చేజార్చుకోవడం విశేషం. కివీస్‌ బ్యాటర్లలో డెవన్‌ కాన్వే 59, గ్లెన్‌ పిలిప్స్‌ 54 పరుగులు చేశారు. అర్ష్‌దీప్‌ , సిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశాడు.

19 ఓవర్లలో న్యూజిలాండ్‌ 155/9
19 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టిమ్‌ సౌథీ ఆరు పరుగులు, ఫెర్గూసన్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

17 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 147/4
17 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.  క్రీజులో మిచెల్‌(9), నీషమ్‌(0) ఉన్నారు.

13 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 105/2
13 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(48), ఫిలిప్స్‌(35) పరుగులతో ఉన్నారు.

10 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 74/2
10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. ‍క్రీజులో కాన్వే(38), ఫిలిప్స్‌(14) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
44 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్క్‌ చాప్‌మాన్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 46/2

తొలి వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ రూపంలో న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో అలెన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 9/1

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో మార్క్‌ చాప్‌మన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

అదే విధంగా భారత్‌ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో పేస్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. ఇక మరోసారి భారత బ్యాటర్‌ సంజూ శాంసన్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తుది జట్లు:
భారత్‌: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కాన్వే), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, టిమ్ సౌతీ(కెప్టెన్‌), లాకీ ఫెర్గూసన్
చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్‌ స్థానంలో అతడు రావాలి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement