India vs New Zealand: Suryakumar Yadav after wreaking havoc in 2nd T20I - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: హార్దిక్‌ ఆదేశించాడు.. అలా చేయమని!నేను పూర్తి చేశాను

Published Mon, Nov 21 2022 9:37 AM | Last Updated on Mon, Nov 21 2022 10:11 AM

Suryakumar Yadav after wreaking havoc in 2nd T20I against Nz - Sakshi

టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇప్పడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోను అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్‌ విధ్వంసం సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో సూర్య అద్భుతమైన శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్‌ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్‌ తన ఇన్నింగ్స్‌పై ఆనందం వ్యక్తం చేశాడు.

హార్దిక్‌ నాతో చెప్పాడు..
మ్యాచ్‌ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ అమెజాన్ ప్రైమ్‌తో సూర్య మాట్లాడుతూ.."టీ20 క్రికెట్‌లో సెంచరీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ చివరి వరకు ఆడాలి అనుకున్నాను. మరోవైపు నుంచి హార్దిక్‌ కూడా అదే చెప్పాడు. 18,19వ ఓవర్‌ వరకు క్రీజులో ఉండమని హార్దిక్‌ నాతో చెప్పాడు.

మనకు 180-15 పరుగుల వరకు స్కోర్‌ అవసరమని అతడు అన్నాడు. అయితే మా స్కోర్‌ బోర్డు 191 పరుగులకు చేరడం సంతోషంగా అనిపించింది. ఇక నేను ఈ విధంగా బ్యాటింగ్‌ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. నేను నెట్స్​లో కూడా ఈ విధంగానే ప్రాక్టీస్‌ చేస్తాను" అని అతడు పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 నేపియర్‌ వేదికగా మంగళవారం జరగనుంది.
చదవండి: IND vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement