లక్నోలోని అటల్ బిహారి వాజ్‌పేయ్ స్టేడియం వేదికగా నిన్న (జనవరి 29) న్యూజిలాండ్‌తో జరిగిన లో స్కోరింగ్, హై ఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా ఆపసోపాలు పడి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో హార్ధిక్ సేన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుని సిరీస్ విజయావకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్) తన సహజ శైలికి భిన్నంగా ఆచితూచి ఆడి, జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
With young and energetic SKY (Mr. 360°) at official residence, Lucknow.@surya_14kumar pic.twitter.com/hHGB2byHcu
— Yogi Adityanath (@myogiadityanath) January 30, 2023
సూర్యకు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్) సహకరించాడు. బంతి నాట్యం చేస్తున్న పిచ్‌పై ఎంతో సంయమనం పాటించి, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతుచిక్కని పిచ్‌పై వికెట్ కాపాడుకుంటూ, ఇటుకలు పేర్చిన చందంగా ఒక్కో పరుగు రాబట్టి ఇన్నింగ్స్‌ను నిర్మించిన సూర్యకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
🇮🇳✌️
— Yogi Adityanath (@myogiadityanath) January 29, 2023
हार्दिक बधाई... pic.twitter.com/mm3Ui9F2jx
కాగా, రెండో టీ20లో టీమిండియాకు ఎంతో అవరసమైన విక్టరీని అందించిన సూర్యకుమార్.. ఇవాళ ఉదయం ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అతని అధికారిక నివాసంలో కలిశాడు. ఈ సందర్భంగా సూర్యతో కలిసి దిగిన ఫోటోను స్వయంగా యోగినే ట్విటర్‌లో షేర్ చేశాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, శక్తివంతుడైన స్కై (మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్)తో లక్నోలోని అధికారిక నివాసంలో అంటూ యోగి తన ట్వీట్‌కు కామెంట్స్ జోడించాడు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన యోగి.. టీమిండియా గెలుపు అనంతరం కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు పుష్పగుచ్చం అందించి అభినందించాడు. ఈ ఫోటోను నిన్ననే ట్విటర్‌లో షేర్ చేసిన యోగి.. హార్ధిక్.. బదాయి హో (అభినందనలు) అంటూ కామెంట్స్ జోడించాడు. ఈ రెండు ట్వీట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment