Border-Gavaskar Trophy 2023: India Vs Australia 1st Test Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Ind Vs Aus 1st Test Updates: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్‌దే పైచేయి

Published Thu, Feb 9 2023 9:02 AM | Last Updated on Thu, Feb 9 2023 4:39 PM

Ind Vs Aus BGT 2023 1st Test Nagpur:Highlights And Updates - Sakshi

ట్రోఫీతో రోహిత్‌ శర్మ- ప్యాట్‌ కమిన్స్‌

India vs Australia, 1st Test Updates And Highlights:
తొలి రోజు ముగిసిన ఆట.. 
ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆటముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోయి 77 పరుగులు చేసింది. రాహుల్‌ 20 పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ(55), అశ్విన్‌(0) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.
తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
76 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రాహుల్‌.. ముర్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో రోహిత్‌ శర్మ(55), అశ్విన్‌ ఉన్నారు.
18 ఓవర్లలో టీమిండియా 59/0
18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 42, కేఎల్‌ రాహుల్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న రోహిత్‌..
తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(26), కేఎల్‌ రాహుల్‌(1) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

177 పరుగులకు ఆలౌట్‌ అయిన ఆస్ట్రేలియా 
భారత బౌలర్ల ధాటికి 177 పరుగులకే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 63.5 ఓవర్లలో కంగారూల కథ ముగించారు టీమిండియా బౌలర్లు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మార్నస్‌ లబుషేన్‌ 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్‌ 37, హ్యాండ్స్‌కోంబ్‌ 31, అలెక్స్‌ క్యారీ 36 పరుగులు చేశారు.

ఇక టీమిండియా బౌలర్లలో అత్యధికంగా జడేజా 5 వికెట్లు తీయగా.. అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్లు సిరాజ్‌, షమీ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. 

62.3: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన హ్యాండ్స్‌కోంబ్‌(31)

టీ బ్రేక్‌ సమయానికి (60 ఓవర్లలో) ఆస్ట్రేలియా స్కోరు-174/8
హ్యాండ్స్‌కోండ్‌, నాథన్‌ లియోన్‌ క్రీజులో ఉన్నారు.

58.5: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
జడేజా బౌలింగ్‌లో టాడ్ మర్ఫీ(0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

కెప్టెన్‌ అవుట్‌
57.3: కమిన్స్‌ రూపంలో ఏడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా.. అశ్విన్‌ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి కమిన్స్‌(6) అవుటయ్యాడు.

54 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు- 168/6
53.1: ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌ టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ తన తొలి వికెట్‌ తీశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఆసీస్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీ(33 బంతుల్లో 36 పరగులు)ని బౌల్డ్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. హ్యాండ్స్‌కోంబ్‌, కమిన్స్‌ క్రీజులో ఉన్నారు. 

నిలకడగా ఆడుతున్న క్యారీ(21), హ్యాండ్స్‌కోంబ్‌(20)
50 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు- 144-5

45 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోరు- 120/5

స్మిత్‌ అవుట్‌
41.6: చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసి రవీంద్ర జడేజా ఆసీస్‌తో తొలి టెస్టులో అదరగొడుతున్నాడు. లబుషేన్‌, రెన్షాలను పెవిలియన్‌కు పంపిన జడ్డూ.. అదే జోరులో ఆసీస్‌ కీలక బ్యాటర్‌ స్మిత్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అలెక్స్‌ క్యారీ, హ్యాండ్స్‌కోంబ్‌ క్రీజులో ఉన్నారు.

41 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు:  105-4
స్మిత్‌, హ్యాండ్స్‌కోంబ్‌ క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
35.6: లబుషేన్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన రెన్షాను జడేజా ఎల్బీడబ్ల్యూ చేశాడు.

మూడో వికెట్‌ డౌన్‌
35.5: నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను అవుట్‌ చేసి టీమిండియాకు మూడో వికెట్‌ అందించాడు రవీంద్ర జడేజా.

►లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. స్మిత్‌19 పరుగులతో క్రీజులో ఉండగా.. లబుషేన్‌ అర్ధ శతకం (47) దిశగా పయనిస్తున్నాడు.

26 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు- 59/2
లబుషేన్‌(33), స్టీవ్‌ స్మిత్‌(16) వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

ఆసీస్‌ అర్ధ సెంచరీ
రెండు వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి పర్యాటక జట్టు 50 పరుగులు పూర్తి చేసుకుంది. లబుషేన్‌ 30, స్మిత్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

13 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 29/2
స్మిత్‌ 6, మార్నస్‌ లబుషేన్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. షమీ, అక్షర్‌, సిరాజ్‌, జడేజా వరుస ఓవర్లు వేస్తున్నారు. 

ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు- 20/2.

2.1: రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
మహ్మద్‌ షమీ ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(1)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ స్కోరు: 6/2 (3).

1.1: తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
మహ్మద్‌ సిరాజ్‌ ఆరంభంలోనే ఆస్ట్రేలియాను గట్టి దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను పెవిలియన్‌కు పంపాడు. అద్బుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. వికెట్ల ముందు ఖవాజాను దొరకబుచ్చుకుని రెండో ఓవర్‌ మొదటి బంతికే టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు.

ఒక పరుగు మాత్రమే చేసిన ఖవాజా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వార్నన్‌, లబుషేన్‌ క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 2-1

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా
సంప్రదాయ క్రికెట్‌ ప్రేమికులను అలరించే ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గురువారం ఆరంభమైంది. నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మొదలైన టెస్టుతో సిరీస్‌కు తెరలేచింది. కాగా తొలి టెస్టులో టాస్‌ గెలిచిన పర్యాటక ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

సూర్య, భరత్‌ అరంగేట్రం
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 తొలి టెస్టు సందర్భంగా టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ తొలిసారి భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. టాడ్‌ మర్ఫీకి తొలిసారి ఆస్ట్రేలియా తరఫున తొలి టెస్టు ఆడే అవకాశం లభించింది.

తుది జట్లు:
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్

చదవండి: T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement