IND Vs AUS: భారత్‌కు గుడ్ న్యూస్‌.. బుమ్రా ఫుల్ ఫిట్‌! బౌలింగ్‌ వీడియో వైరల్‌ | IND Vs AUS: No Injury Concerns For Jasprit Bumrah, Bowls Full Tilt In Nets To Rahul And Jaiswal, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs AUS: భారత్‌కు గుడ్ న్యూస్‌.. బుమ్రా ఫుల్ ఫిట్‌! బౌలింగ్‌ వీడియో వైరల్‌

Published Thu, Dec 12 2024 9:58 AM | Last Updated on Thu, Dec 12 2024 11:05 AM

IND vs AUS: No injury concerns for Jasprit Bumrah, bowls full tilt in nets

అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్టు అనంత‌రం టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళ‌న నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సంద‌ర్భంగా బుమ్రా తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన త‌ర్వాత బుమ్ర త‌న బౌలింగ్‌ను కొన‌సాగించాడు. 

కానీ అత‌డు పూర్తి ఫిట్‌గా లేడ‌ని, బ్రిస్బేన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో టెస్టుకు దూరం కానున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అవ‌న్నీ వ‌ట్టి రూమ‌ర్సే అని చెప్పాలి. ఎందుకంటే బుమ్రా ఫుల్ ఫిట్‌నెస్‌తో నెట్స్‌లో శ్ర‌మిస్తున్నాడు. 

నెట్స్‌లో కేఎల్ రాహుల్‌, య‌శ‌స్వీ జైశ్వాల్‌కు బుమ్రా సుదీర్ఘ కాలం పాటు బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భరత్ సుందరేశన్ యూజ‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వీడియోలో బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేస్తున్న‌ట్లు క‌న్పించింది. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లును బుమ్రా త‌న ఖాతాలో వేసుకున్నాడు.

హర్షిత్‌ ఔట్‌.. ప్రసిద్ద్‌ ఇన్‌?
డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో భారత్‌ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.  రెండో టెస్టులో విఫలమైన పేసర్‌ హర్షిత్‌ రాణాపై జట్టు మేనెజ్‌మెంట్‌ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ప్రసిద్ద్‌ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. అదే విధంగా అశ్విన్‌ స్ధానంలో జడేజాను ఆడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ గబ్బా టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది.

భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), రోహిత్ శర్మ (కెప్టెన్‌), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ప్ర‌సిద్ద్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement