భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్ చేరుకోగా.. టీమిండియా సోమవారం భాగ్యనగరానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 14 సిక్స్‌లు బాదితే టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(91) రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు. ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 77 సిక్సర్లతో మూడో స్ధానంలో ఉన్నాడు.
రోహిత్ కంటే ముందు రెండో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(78) ఉన్నాడు. కాగా రోహిత్‌కు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌తో 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 49.80 సగటుతో 747 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment