IND vs SA: Fans Troll Virat Kohli & Rohit Sharma Ego Becomes Bigger Than Indian Cricket - Sakshi
Sakshi News home page

Ind Vs Sa: రోహిత్‌కు ఫిట్‌నెస్‌ మీద సోయి లేదు.. కోహ్లికి ఇంకేదో సమస్య.. ఆట కంటే ఇగోలే ఎక్కువా?

Published Tue, Dec 14 2021 2:26 PM | Last Updated on Tue, Dec 14 2021 4:52 PM

Ind Vs Sa: Fans Troll Kohli Rohit Ego Becomes Bigger Than Indian Cricket - Sakshi

Fans Troll Virat Kohli And Rohit Sharma: సఫారీ గడ్డ మీద ఇంతవరకు టీమిండియా ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు... భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో పటిష్టమైన కోహ్లి సేన ఈ ఫీట్‌ను సాధిస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ... రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం, టెస్టు వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌ శర్మ సిరీస్‌కు దూరం కావడం వంటి పరిణామాలు వారిని కలవరపెడుతున్నాయి. 

దీంతో... ఈ సారి కూడా అందని ద్రాక్ష అందకుండానే పోతుందోమోననే భయాలు వెంటాడుతున్నాయి. మరోవైపు వన్డే కెప్టెన్సీ చేతులు మారడంతో నిరాశకు గురైన విరాట్‌ కోహ్లి సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తన గారాల పట్టి వామిక ఫస్ట్‌ బర్త్‌డేను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సెలవు తీసుకోవాలని భావిస్తున్నా.. తన పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఇగోల కోసం ఆటను భ్రష్టు పట్టిస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘గాయం కారణంగా రోహిత్‌ శర్మ టెస్టు సిరీస్‌కు దూరం... వన్డే సిరీస్‌ నుంచి కోహ్లి విరామం తీసుకుంటున్నాడు. ఇదొక సినిమా స్క్రిప్ట్‌ కంటే ఏమీ తక్కువ కాదు.. ఇందుకోసం బీసీసీఐకి అవార్డు ఇవ్వాల్సిందే’’ అంటూ ఓ నెటిజన్‌ మండిపడ్డారు.

మరికొంత మంది.. ‘‘కోహ్లి నిరాశ చెందడం సహజం. అయితే, కేవలం కెప్టెన్సీ లేదనే కారణంగా.. కూతురి బర్త్‌డేను సాకుగా చూపి సిరీస్‌ నుంచి తప్పుకొంటే మాత్రం అతడికి ఎప్పటికీ మద్దతు పలకబోము’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది.. ‘‘రోహిత్‌కు ఫిట్‌గా ఉండాలన్న సోయి లేదు. కోహ్లికేమో ఇగో అనుకుంటా... ఒకరి కెప్టెన్సీ ఒకరు ఆడరేమో.. వీళ్లకు ఆట కంటే పట్టింపులే ఎక్కువయ్యాయి. అంతా కలిసి జట్టును ఎటువైపు నడిపిస్తారో’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, వీరి అభిమానులు మాత్రం... ‘‘ఆటగాళ్లకు వారి వ్యక్తిగత జీవితాలు కూడా ముఖ్యమే కదా’’ అని సమర్థిస్తున్నారు.

చదవండి: Ind Vs SA- Test Series: రోహిత్‌ శర్మ స్థానంలో ప్రియాంక్‌ పాంచల్‌.. 314 నాటౌట్‌.. 24 సెంచరీలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement