Updated ICC World Test Championship Points Table : ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. 2-0 తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీస పాయింట్ల పట్టికలో టీమిండియా ఒక స్థానం మెరుగుపరచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 విజయాలు సాధించిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయాలు(4) సాధించిన ఆస్ట్రేలియా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత పాకిస్తాన్(3),దక్షిణాఫ్రికా(3) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
PC: ICC
కాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక సిరీస్‌ల నేపథ్యంలో ఆరు మ్యాచ్‌లలో గెలుపొందిన భారత జట్టు మూడింట ఓటమి పాలుకాగా.. రెండు డ్రా చేసుకుంది. తద్వారా 77 పాయింట్లు సాధించింది. ఇక నిర్ణీత సీజన్‌లో ఒక జట్టు ఆడిన సిరీస్‌లు, గెలుపు, ఓటములు, డ్రాల సంఖ్య ఆధారంగా పాయింట్ల కేటాయింపు, డబ్ల్యూటీసీ పట్టికలో స్థానం నిర్ణయించబడుతుంది.
చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ
That's that from the Chinnaswamy Stadium.#TeamIndia win the 2nd Test by 238 runs and win the series 2-0.@Paytm #INDvSL pic.twitter.com/k6PkVWcH09
— BCCI (@BCCI) March 14, 2022
Comments
Please login to add a commentAdd a comment