రవీంద్ర జడేజా (PC: Twitter)
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చర్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మొదటిరోజు ఆటలో జడ్డూ బౌలింగ్ చేసే క్రమంలో అంపైర్‌ను కాసేపు వెయిట్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్ పర్యటనను టీమిండియా టెస్టు సిరీస్‌తో మొదలుపెట్టింది.
ఇరు జట్ల మధ్య బుధవారం డొమినికా వేదికగా తొలి మ్యాచ్ ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆతిథ్య కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే, టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది.
అశూ, జడ్డూ చెలరేగడంతో
అశూ ఐదు వికెట్లతో చెలరేగగా.. జడ్డూ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పేసర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో తొలిరోజే విండీస్ కేవలం 150 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 162 పరుగుల ఆధిక్యం సాధించింది.
కళ్లద్దాల్లో జుట్టు సరిచేసుకుంటూ
ఇదిలా ఉంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా రవీంద్ర జడేజా తన మూడో ఓవర్ బౌల్ చేసేటపుడు వ్యవహరించిన తీరు నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ‘ది బాయ్స్’ మీమ్‌తో జడ్డూ వీడియోను షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తొలుత బంతి అందుకున్న జడేజా చేతులతో జుట్టు దువ్వుకున్నాడు. ఆ తర్వాత తన కళ్లద్దాలు తీసి అందులో ముఖం చూసుకుంటూ మళ్లీ జుట్టు సరిచేసుకున్నాడు.
పాపం ఆ అంపైర్.. జడ్డూ స్టైలే వేరు
ఇక అప్పటి వరకు పాపం ఆ అంపైర్ బిక్కముఖం వేసుకుని జడ్డూ వైపు చూశాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘జడ్డూ.. అంటే ఆ మాత్రం ఉండాలి! మన స్టైల్ ఇదే కదా! పాపం ఆ అంపైర్.. నువ్వేం చేస్తున్నావో అని తదేకంగా నిన్నే చూశాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక వెస్టిండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగడం అభిమానులకు కన్నుల పండుగ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతక్కొట్టడం వల్ల భారత్‌కు మంచి ఆధిక్యం లభించింది.
చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..
విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్
Comments
Please login to add a commentAdd a comment