Ind Vs WI 2023: Team India Reach Dominica Ahead Of Test Series, Kohli Ishan Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ind Vs WI: విండీస్‌తో పోరుకు సిద్ధం.. డొమినికాకు చేరుకున్న టీమిండియా.. ఫొటోలు వైరల్‌

Published Sat, Jul 8 2023 2:26 PM | Last Updated on Sat, Jul 8 2023 3:00 PM

Ind Vs WI Tests: Team India Reach Dominica Kohli Ishan Pics Goes Viral - Sakshi

Ind Vs WI 2023: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా డొమినికాకు చేరుకుంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు బార్బడోస్‌ నుంచి శనివారం బయల్దేరి అక్కడికి తొలి టెస్టు జరుగనున్న పట్టణంలో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా జూలై 12 నుంచి విండీస్‌- భారత్‌ మధ్య మ్యాచ్‌తో టెస్టు సిరీస్‌కు తెరలేవనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ను రోహిత్‌ సేన ఈ మేరకు వెస్టిండీస్‌తో ఆరంభించనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డొమినికాలోని రోసోలో గల విండ్సర్‌ పార్కులో జూలై 12- 16 వరకు తొలి మ్యాచ్‌ జరుగనుంది.

ఇక ఆ తర్వాత ఇరు జట్లు జూలై 20- 24 వరకు ట్రినిడాడ్‌లో మలి టెస్టులో తలపడతాయి. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక కానుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన రోహిత్‌ సేన.. దాదాపు 20 రోజుల విశ్రాంతి తర్వాత కరేబియన్‌ దీవిలో అడుగుపెట్టింది.

ఈ క్రమంలో ఇప్పటికే బార్బడోస్‌లో కావల్సినంత ప్రాక్టీస్‌ చేసిన భారత జట్టు.. ఇక అసలైన మ్యాచ్‌ కోసం తాజాగా డొమినికాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ షేర్‌ చేసిన ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌ నవ్వులు చిందిస్తున్న ఫొటో హైలైట్‌గా నిలిచింది.

వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

చదవండి: నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
రోహిత్‌, కోహ్లి టీ20 కెరీర్‌ ముగిసినట్లేనా?! వాళ్లు ఎవరైతే ఏంటి?: గంగూలీ
టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్‌.. ఆ ఇద్దరు తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement