చ‌రిత్ర సృ‍ష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా | India Create History With Win Against Namibia, Become First Team In The World | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చ‌రిత్ర సృ‍ష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Feb 13 2026 8:12 AM | Updated on Feb 13 2026 9:11 AM

India Create History With Win Against Namibia, Become First Team In The World

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ టీమిండియా త‌న జోరును కొన‌సాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా నమీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ స‌త్తాచాటింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న‌మీబియా 18.2 ఓవ‌ర్ల‌లో 116 పరుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును త‌మ‌పేరిట లిఖించుకుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ‌క‌ప్‌-2024లో టీమిండియా వ‌రుస‌గా 8 విజ‌యాలు సాధించి ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఇప్పుడు వ‌రుస‌గా రెండు విజ‌యాలు న‌మోదు చేయ‌డంతో ఈ అరుదైన భార‌త్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు వ‌రుస‌గా 8 విజ‌యాలు న‌మోదు చేశాయి.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వరుస‌గా అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్లు ఇవే
భార‌త్‌-10
ఆస్ట్రేలియా-8
ద‌క్షిణాఫ్రికా-8
ఇంగ్లండ్‌-7
చ‌ద‌వండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement