డ్రా చేసుకున్నా చాలు.. సిరీస్‌ మనదే | India to take on England in final Test today at Old Trafford | Sakshi
Sakshi News home page

ENG Vs IND 5th Test: డ్రా చేసుకున్నా చాలు.. సిరీస్‌ మనదే

Published Fri, Sep 10 2021 4:54 AM | Last Updated on Fri, Sep 10 2021 8:17 AM

India to take on England in final Test today at Old Trafford - Sakshi

భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై 2007లో టెస్టు సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత ఆడిన మూడు సిరీస్‌లలో 0–4, 1–3, 1–4తో ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి పటౌడీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం టీమిండియా ముంగిట నిలిచింది. కోహ్లి సేన కనీసం మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా చాలు. ఇంగ్లండ్‌ మాత్రం స్వదేశంలో సిరీస్‌ కోల్పోకుండా ఉండాలనే తప్పనిసరిగా మ్యాచ్‌ గెలవాల్సిన స్థితిలో ఉంది.

మాంచెస్టర్‌: భారత క్రికెట్‌ జట్టు ఈ టూర్‌ కోసం ఇంగ్లండ్‌లో అడుగు పెట్టి నేటితో సరిగ్గా వంద రోజులు!  ఈ ‘సెంచరీ’లో డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ చేతిలో ఓటమి, ఇంగ్లండ్‌పై రెండు అద్భుత విజయాలు, ఒక పరాజయం ఉన్నాయి. తమ పర్యటనను చిరస్మరణీయం చేసుకునే క్రమంలో టీమిండియా ఇప్పుడు చివరి ఘట్టాన నిలిచింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో నేటినుంచి జరిగే చివరి పోరులో భారత్‌ తలపడనుంది.

విహారికి అవకాశం ఉందా!
కెపె్టన్‌ కోహ్లి లెక్క ప్రకారం చూస్తే గత మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టులో ఎలాంటి మార్పూ అవసరం లేదు. రోహిత్, పుజారా, జడేజా స్వల్ప గాయాలతో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా...మ్యాచ్‌ సమయానికి వారంతా సిద్ధమవడం ఖాయం. ఇంగ్లండ్‌ను రెండు సార్లు ఆలౌట్‌ చేసేందుకు మరోసారి నాలుగు పేసర్ల వ్యూహాన్నే కోహ్లి కోరుకుంటే అశి్వన్‌ ఈ మ్యాచ్‌లోనూ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే అశి్వన్‌ను చోటు కలి్పంచవచ్చని చర్చ జరుగుతున్నా...ఇంకా సిరీస్‌ గెలవలేదు కాబట్టి మేనేజ్‌మెంట్‌ అలాంటి సాహసం చేయకపోవచ్చు. అయితే ఒకే ఒక స్థానం విషయంలో మాత్రం కొంత అనిశ్చితి ఉంది. సిరీస్‌ మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో కలిపి 109 పరుగులే చేసిన రహానేకు మరో అవకాశం ఇస్తారా అనేదే చూడాలి. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్న రహానేను తప్పించాలని అనుకుంటే ఆరో స్థానంలో విహారి సరైన వ్యక్తి కాగలడు. జట్టు మొత్తం ఓవల్‌ తరహాలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే టీమిండియాను నిలువరించడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమవుతుంది.  

రూట్‌ మినహా...
గత కొన్నేళ్లలో ఇంగ్లండ్‌ జట్టు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఎప్పుడూ లేదు. భారత్‌తో సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన రూట్‌ సేన వరుసగా రెండో సిరీస్‌ ఓడిపోయే ప్రమాదంలో నిలిచింది. సొంతగడ్డపై కూడా ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పేలవంగా ఆడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన కెపె్టన్‌ రూట్‌ గత మ్యాచ్‌లోనూ జట్టును రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అతను తప్ప మరో బ్యాట్స్‌మన్‌ను నమ్మలేని పరిస్థితిలో ఇంగ్లండ్‌ ఉంది. కీపర్‌గా బట్లర్‌ మళ్లీ టీమ్‌లోకి వచి్చనా తొలి మూడు టెస్టుల్లోనూ అతను రాణించింది లేదు. అయితే ఆ జట్టుకు పెద్దగా ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో లేవు. ఓవల్‌లో పోప్‌ రాణించడంతో ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోపై వేటు ఖాయమైంది. సీనియర్‌ స్టార్‌ అండర్సన్‌కు విశ్రాంతి  ఇవ్వాలనే ఆలోచన ఉన్నా...సొంత మైదానంలో జిమ్మీ అందుకు ఇష్టపడకపోవచ్చు. మొత్తంగా  ఇంగ్లండ్‌ మ్యాచ్‌ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్‌ తమ శక్తికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంది.  

అసిస్టెంట్‌ ఫిజియోకు కరోనా
సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నా మ్యాచ్‌ జరిగే విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో టీమిండియా అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ కరోనా ‘పాజిటివ్‌’గా తేలడమే అం దుకు కారణం. గత నాలుగు రోజులుగా యోగేశ్‌... గాయాలతో ఇబ్బంది పడుతున్న జట్టు సభ్యులు రోహిత్, పుజారా, షమీ, జడేజాలకు ఫిజియోగా తన సేవలు అందించాడు. ప్రధాన ఫిజియో నితిన్‌ పటేల్‌ ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉండటంతో పర్మార్‌ ఎక్కువ సమయం టీమిండియా ఆటగాళ్లతో గడపాల్సి వచి్చంది. మ్యాచ్‌ ముందు రోజు టీమ్‌ ప్రాక్టీస్‌ కూడా రద్దయింది. గురువారం రాత్రి
వచి్చన నివేదికల్లో జట్టు సభ్యులంతా ‘నెగెటివ్‌’గా తేలారు. అయితే సహజంగానే కోవిడ్‌ లక్షణాలు కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉండటంతో మ్యాచ్‌కు ఏమైనా అంతరాయం కలుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ అనూహ్యంగా మ్యాచ్‌ జరిగే అవకాశం లేకపోతే సిరీస్‌లో విజేతను ప్రకటించకుండా అసంపూర్తిగా ముగించి తర్వాతి రోజుల్లో విడిగా ఈ ఒక్క టెస్టును నిర్వహించేందుకు అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement