five test match series
-
India vs England 4th Test Day 4: కుర్రాళ్లు కొట్టేశారు
కింగ్ కోహ్లి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ గాయంతో తర్వాత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వైఫల్యంతో శ్రేయస్ అయ్యర్‌ను తీసేశారు. ఇక ప్రధాన బ్యాటింగ్ దళానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పెద్ద దిక్కు. రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్... వీళ్లంతా పూర్తిగా కొత్తవాళ్లు! ఈ సిరీస్‌తోనే అరంగేట్రం చేశారు. 11 మందిలో నలుగురు కొత్తవాళ్లతో... మిగతా అనుభవం లేనివారితో... సంప్రదాయ మ్యాచ్‌లాడి ఇంగ్లండ్‌లాంటి ‘బజ్‌బాల్’ దూకుడు జట్టును ఓడించడం ఆషామాషీ కానేకాదు. కానీ కుర్రాళ్లతో నిండిన టీమిండియా ఆడి గెలిచింది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తర్వాత టీమిండియా భవిష్యత్తుకు కొండంత విశ్వాసాన్ని ఈ సిరీస్ ఇచి్చంది. రాంచీ: ఐదు టెస్టుల సిరీస్‌ను ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3–1తో కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌ల్లాగే నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగో టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్, కెపె్టన్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (124 బంతుల్లో 52 నాటౌట్; 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్ ధ్రువ్ జురెల్ (77 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు) టెస్టు విజయానికి అవసరమైన పరుగుల్ని అజేయంగా చేసి పెట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా, రూట్, హార్ట్లీలకు చెరో వికెట్ దక్కింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలకమైన పరుగులు చేసిన కొత్త వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రోహిత్, గిల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ఈ టెస్టుతో పాటు సిరీస్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉండగా... ఓవర్‌నైట్ స్కోరు 40/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ ఒడిదొడుకుల్లేకుండా నడిపించారు. కుదురుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 37; 5 ఫోర్లు)ను జట్టు స్కోరు 84 పరుగుల వద్ద రూట్ బోల్తా కొట్టించాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక మరో ఓపెనర్ రోహిత్‌ను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. 99/2 వద్ద ఓపెనర్లే అవుటయ్యారు. ఇక్కడిదాకా టీమిండియా మంచి స్థితిలోనే ఉంది. అయితే బషీర్ స్పిన్నేయడంతో రజత్ పటిదార్ (0), జడేజా (4), సర్ఫరాజ్ (0)లు బ్యాట్లెత్తారు. అప్పుడు భారత్ స్కోరు 120/5. సగం వికెట్లను కోల్పోయింది. ఇక మిగిలిన సగంలో జురెల్ తప్ప అంతా స్పెషలిస్టు బౌలర్లే! లక్ష్యమింకా 72 పరుగుల దూరంలో ఉంది. ఇలాంటి గడ్డు స్థితిలో శుబ్‌మన్, జురెల్ మొండి పోరాటం చేశారు. ఇంగ్లండ్ సారథి స్టోక్స్ వరుసబెట్టి స్పిన్ త్రయం బషీర్, హార్ట్లీ, రూట్‌లతోనే బౌలింగ్ వేయించాడు. అయినా ప్రత్యర్థి జట్టుకు పట్టుబిగించే అవకాశమివ్వకుండా... మరో వికెట్ పడకుండా గిల్–జురెల్ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలో శుబ్‌మన్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... టీ విరామానికి ముందే భారత్ విజయతీరాలకు చేరుకుంది. ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో టెస్టుతోపాటు సిరీస్ కూడా మన జట్టు వశమైంది. ► వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 3–1తో ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ 64.58 శాతంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (75) అగ్రస్థానంలో, ఆ్రస్టేలియా (55) మూడోస్థానంలో ఉన్నాయి. ► ఈ టెస్టూ నాలుగో రోజుల్లో ముగియడం... ధర్మశాలలో ఆఖరి టెస్టు (మార్చి 7 నుంచి)కు 9 రోజుల విరామం ఉండటంతో ఇంగ్లండ్ జట్టు సభ్యులు రెండు వేర్వేరు చోట్ల విశ్రాంతి తీసుకోనున్నారు. కొన్నాళ్లు చండీగఢ్, ఆ తర్వాత బెంగళూరుల్లో స్టోక్స్ బృందం సేద తీరుతుంది. మూడో టెస్టుకు ముందూ ఇలాంటి గ్యాపే ఉండటంతో ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో విశ్రాంతి తీసుకొని వచి్చంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 145; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 55; యశస్వి (సి) అండర్సన్ (బి) రూట్ 37; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 52; రజత్ పటిదార్ (సి) పోప్ (బి) బషీర్ 0; జడేజా (సి) బెయిర్‌స్టో (బి) బషీర్ 4; సర్ఫరాజ్ (సి) పోప్ (బి) బషీర్ 0; ధ్రువ్ జురెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–84, 2–99, 3–100, 4–120, 5–120. బౌలింగ్: జో రూట్ 7–0–26–1, హార్ట్లీ 25–2–70–1, బషీర్ 26–4–79–3, అండర్సన్ 3–1–12–0. 17: స్వదేశంలో భారత్‌కిది వరుసగా 17వ టెస్టు సిరీస్ విజయం. చివరిసారి టీమిండియా సొంతగడ్డపై 2012లో ఇంగ్లండ్ చేతిలోనే ఓడిపోయింది. -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్‌కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
India v England: ముగ్గురు కొత్తవారికి చోటు
లండన్: వచ్చే నెలలో భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం పర్యటించే ఇంగ్లండ్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు గుస్ అట్కిన్సన్, టామ్ హార్ట్లే, షోయబ్ బషీర్‌లకు తొలిసారి చోటు లభించింది. కౌంటీ క్రికెట్లో సర్రే క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే 25 ఏళ్ల పేస్ బౌలర్ అట్కిన్సన్ ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున తొమ్మిది వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్ బృందంలో నలుగురు స్పెషలి‹Ù్ట స్పిన్నర్లు రేహన్ అహ్మద్, జాక్ లీచ్, హార్ట్లే, షోయబ్ బషీర్ ఉండటం విశేషం. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. రెండో టెస్ట్ (ఫిబ్రవరి 2–6) విశాఖపట్నంలో, మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15–19) రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23–27) రాంచీలో, ఐదో టెస్ట్ (మార్చి 7–11) ధర్మశాలలో జరుగుతాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, ఒలీ పోప్, జేమ్స్ అండర్సన్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, ఒలీ రాబిన్సన్, మార్క్ వుడ్, రేహన్ అహ్మద్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లే, జాక్ లీచ్, అట్కిన్సన్. -
డ్రా చేసుకున్నా చాలు.. సిరీస్ మనదే
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 2007లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఆడిన మూడు సిరీస్‌లలో 0–4, 1–3, 1–4తో ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి పటౌడీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం టీమిండియా ముంగిట నిలిచింది. కోహ్లి సేన కనీసం మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా చాలు. ఇంగ్లండ్ మాత్రం స్వదేశంలో సిరీస్ కోల్పోకుండా ఉండాలనే తప్పనిసరిగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఉంది. మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఈ టూర్ కోసం ఇంగ్లండ్‌లో అడుగు పెట్టి నేటితో సరిగ్గా వంద రోజులు! ఈ ‘సెంచరీ’లో డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి, ఇంగ్లండ్‌పై రెండు అద్భుత విజయాలు, ఒక పరాజయం ఉన్నాయి. తమ పర్యటనను చిరస్మరణీయం చేసుకునే క్రమంలో టీమిండియా ఇప్పుడు చివరి ఘట్టాన నిలిచింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటినుంచి జరిగే చివరి పోరులో భారత్ తలపడనుంది. విహారికి అవకాశం ఉందా! కెపె్టన్ కోహ్లి లెక్క ప్రకారం చూస్తే గత మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టులో ఎలాంటి మార్పూ అవసరం లేదు. రోహిత్, పుజారా, జడేజా స్వల్ప గాయాలతో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా...మ్యాచ్ సమయానికి వారంతా సిద్ధమవడం ఖాయం. ఇంగ్లండ్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసేందుకు మరోసారి నాలుగు పేసర్ల వ్యూహాన్నే కోహ్లి కోరుకుంటే అశి్వన్ ఈ మ్యాచ్‌లోనూ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే అశి్వన్‌ను చోటు కలి్పంచవచ్చని చర్చ జరుగుతున్నా...ఇంకా సిరీస్ గెలవలేదు కాబట్టి మేనేజ్మెంట్ అలాంటి సాహసం చేయకపోవచ్చు. అయితే ఒకే ఒక స్థానం విషయంలో మాత్రం కొంత అనిశ్చితి ఉంది. సిరీస్ మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో కలిపి 109 పరుగులే చేసిన రహానేకు మరో అవకాశం ఇస్తారా అనేదే చూడాలి. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్న రహానేను తప్పించాలని అనుకుంటే ఆరో స్థానంలో విహారి సరైన వ్యక్తి కాగలడు. జట్టు మొత్తం ఓవల్ తరహాలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే టీమిండియాను నిలువరించడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమవుతుంది. రూట్ మినహా... గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ జట్టు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఎప్పుడూ లేదు. భారత్‌తో సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన రూట్ సేన వరుసగా రెండో సిరీస్ ఓడిపోయే ప్రమాదంలో నిలిచింది. సొంతగడ్డపై కూడా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పేలవంగా ఆడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన కెపె్టన్ రూట్ గత మ్యాచ్‌లోనూ జట్టును రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అతను తప్ప మరో బ్యాట్స్‌మన్‌ను నమ్మలేని పరిస్థితిలో ఇంగ్లండ్ ఉంది. కీపర్‌గా బట్లర్ మళ్లీ టీమ్‌లోకి వచి్చనా తొలి మూడు టెస్టుల్లోనూ అతను రాణించింది లేదు. అయితే ఆ జట్టుకు పెద్దగా ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో లేవు. ఓవల్‌లో పోప్ రాణించడంతో ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోపై వేటు ఖాయమైంది. సీనియర్ స్టార్ అండర్సన్‌కు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన ఉన్నా...సొంత మైదానంలో జిమ్మీ అందుకు ఇష్టపడకపోవచ్చు. మొత్తంగా ఇంగ్లండ్ మ్యాచ్ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్ తమ శక్తికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంది. అసిస్టెంట్ ఫిజియోకు కరోనా సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నా మ్యాచ్ జరిగే విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా ‘పాజిటివ్’గా తేలడమే అం దుకు కారణం. గత నాలుగు రోజులుగా యోగేశ్... గాయాలతో ఇబ్బంది పడుతున్న జట్టు సభ్యులు రోహిత్, పుజారా, షమీ, జడేజాలకు ఫిజియోగా తన సేవలు అందించాడు. ప్రధాన ఫిజియో నితిన్ పటేల్ ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉండటంతో పర్మార్ ఎక్కువ సమయం టీమిండియా ఆటగాళ్లతో గడపాల్సి వచి్చంది. మ్యాచ్ ముందు రోజు టీమ్ ప్రాక్టీస్ కూడా రద్దయింది. గురువారం రాత్రి వచి్చన నివేదికల్లో జట్టు సభ్యులంతా ‘నెగెటివ్’గా తేలారు. అయితే సహజంగానే కోవిడ్ లక్షణాలు కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉండటంతో మ్యాచ్‌కు ఏమైనా అంతరాయం కలుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ అనూహ్యంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే సిరీస్‌లో విజేతను ప్రకటించకుండా అసంపూర్తిగా ముగించి తర్వాతి రోజుల్లో విడిగా ఈ ఒక్క టెస్టును నిర్వహించేందుకు అవకాశం ఉంది. -
IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..!
‘ది ఓవల్’ సీమర్ల అడ్డాగా తయారైంది. ప్రతి సెషన్లోనూ పేసర్లదే పైచేయి. బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో పాతుకోకుండా వణికిస్తోంది. మొదట ఇంగ్లండ్ పేసర్ల ముందు మన బ్యాట్స్‌మెన్ తలవంచారు. కోహ్లి అర్ధసెంచరీ భారత్‌కు ఊరటనిస్తే... ఆఖరి సెషన్లో శార్దుల్ ఠాకూర్ మెరుపులు భారత్ స్కోరులో జోరును పెంచాయి. ఇదే సెషన్లో భారత సీమర్లు దీటుగా సత్తాచాటారు. కీలకమైన 3 వికెట్లను పడగొట్టి తొలి రోజే టెస్టును రసవత్తరంగా మార్చారు. మరో 8 బంతుల్లో రోజు ముగుస్తుందనగా అద్భుత బంతితో రూట్‌ను బౌల్డ్ చేసిన ఉమేశ్ ఘనంగా ముగించాడు. లండన్: తొలి 7 ఓవర్లలో భారత్ స్కోరు 28/0... టెస్టులో అది కూడా ఆరంభంలోనే 4 రన్‌రేట్ అసాధారణం. టాస్ గెలిచిన రూట్ నిర్ణయం తప్పనిపించింది. మరో 7 ఓవర్లయ్యాక 14 ఓవర్లలో 28/2. ఇది కూడా అసాధారణమే! వరుసగా ఏడు ఓవర్లను మెయిడిన్లుగా వేసిన ఇంగ్లండ్ సీమర్లు ఓపెనర్ల వికెట్లను పడగొట్టారు. ఇక అక్కడి నుంచి ప్రత్యర్థి పేసర్లు అదరగొట్టారు. తమ నాయకుడి నిర్ణయం సరైందని భారత్‌ను మళ్లీ తొలి రోజే ఆలౌట్ చేశారు. ఏడాది తర్వాత టెస్టు బరిలోకి దిగిన క్రిస్ వోక్స్ (4/55) భారత్ తొలి ఇన్నింగ్స్ కూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (96 బంతుల్లో 50; 8 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్ (5)ను బౌల్డ్ చేశాడు. హమీద్ (0)ను కీపర్ పంత్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఉమేశ్ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్ రూట్ (21)ను క్లీన్»ౌల్డ్ చేశాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 53/3 స్కోరు చేసింది. మలాన్ (26 బ్యాటింగ్), ఒవర్టన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాప్ మరోసారి ఫ్లాప్... మొదటి ఏడు ఓవర్లే మురిపించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (11), రాహుల్ (17) అంతలోనే కుదేలయ్యారు. చతేశ్వర్ పుజారా (4) కూడా చేతులెత్తేశాడు. 39 పరుగుల వద్దే టాపార్డర్ ఫ్లాపయింది. కెప్టెన్ కోహ్లి క్రీజులో నిలిచేందుకు ప్రత్యర్థి పేసర్లతో పోరాడుతున్నాడు. ఆశ్చర్యకరంగా జడేజా (10)ను ఐదో స్థానంలో పంపిన ప్రయోగం ఫలించకపోగా, రహానే (14) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి ఆత్మవిశ్వాసంతో చూడచక్కటి షాట్లు ఆడాడు. 22 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతను, 85 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి 85 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు) పూర్తి చేసుకున్నాడు. కానీ రాబిన్సన్ భారత కెపె్టన్‌ను అక్కడితోనే ఆపేయగా, పంత్ (9) మళ్లీ విఫలమయ్యాడు. స్కోరు 127/7కు చేరగా ఇక ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే ఈ తరుణంలో శార్దుల్ అనూహ్యంగా చెలరేగాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వోక్స్ బౌలింగ్‌లో బౌండరీలు బాదగా... ఓవర్టన్, రాబిన్సన్, వోక్స్ ఓవర్లలో చెరో సిక్సర్ కొట్టాడు. 31 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చకచకా అర్ధసెంచరీని సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన ఫిఫ్టీ. విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ 30 బంతుల్లో సాధించాడు. ఇటీవల కన్ను మూసిన ప్రముఖ కోచ్ వాసు పరాంజపే (82 ఏళ్లు) మృతికి నివాళిగా కోహ్లి సేన నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్ 11; రాహుల్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 17; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 4; కోహ్లి (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్ 50; జడేజా (సి) రూట్ (బి) వోక్స్ 10; రహానే (సి) అలీ (బి) ఒవర్టన్ 14; పంత్ (సి) అలీ (బి) వోక్స్ 9; శార్దుల్ (ఎల్బీ) (బి) వోక్స్ 57; ఉమేశ్ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్ 10; బుమ్రా (రనౌట్) 0; సిరాజ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (61.3 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–39, 4–69, 5–105, 6–117, 7–127, 8–190, 9–190, 10–191. బౌలింగ్: అండర్సన్ 14–3–41–1, రాబిన్సన్ 17.3–9–38–3, వోక్స్ 15–6–55–4, ఒవర్టన్ 15–2–49–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5; హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మలాన్ బ్యాటింగ్ 26; రూట్ (బి) ఉమేశ్ 21; ఒవర్టన్ బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 53. వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52. బౌలింగ్: ఉమేశ్ 6–1–15–1, బుమ్రా 6–2–15–2, శార్దుల్ 3–1–11–0, సిరాజ్ 2–0–12–0. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్, సంగక్కర, పాంటింగ్, జయవర్ధనే, కలిస్, ద్రవిడ్ మాత్రమే అతనికంటే ముందున్నారు. -
Ind Vs Eng 4th Test: చలో ఓవల్... అశ్విన్ ఆడతాడా?!
అడిలైడ్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత కూడా భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవగలిగింది. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టులో పరాజయం పాలైన తర్వాత కూడా మళ్లీ కోలుకొని ప్రత్యర్థిని చిత్తు చేసింది. కింద పడిన ప్రతీసారి మరింత బలంగా పైకి లేవడం భారత్‌కు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు దీనిని చేసి చూపించిన టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో గెలుపు తర్వాత లీడ్స్‌లో ఓటమిని ఆహ్వానించిన కోహ్లి సేన... గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి అమితోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కీలక దశకు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా... మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. లీడ్స్ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం పెరగ్గా... గత మ్యాచ్ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్ దృష్టి పెట్టింది. అశ్విన్ ఆడతాడా! భారత్ తుది జట్టుకు సంబంధించి ఒకే ఒక అంశంపై చర్చ సాగుతోంది. గత మూడు టెస్టుల్లో అవకాశం దక్కని సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఓవల్‌లో ఆడిస్తారా చూడాలి. కోహ్లి మాటల ప్రకారం చూస్తే నలుగురు పేసర్లలో ఎవరికైనా విశ్రాంతి ఖాయం. ఫామ్‌ను చూసుకుంటే ఇషాంత్ శర్మనే పక్కన పెట్టే అవకాశం ఉంది. అతని స్థానంలోనే అశ్విన్ రావాలి. ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం, ఇదే మైదానంలో కొద్ది రోజుల క్రితం కౌంటీ మ్యాచ్ ఆడిన అశ్విన్ 7 వికెట్ల తో చెలరేగడం అతని అవకాశాలను పెంచుతోంది. అయితే టీమ్ మేనేజ్మెంట్ నలుగురు పేసర్లను ఆడించడంపై ఆసక్తి చూపిస్తే మాత్రం బ్యాటింగ్ కూడా చేయగల శార్దుల్‌కు చోటు ఖాయం. బౌలర్‌గా పెద్దగా ప్రభావం చూపకపోయినా, జడేజా బ్యాటింగ్ నైపుణ్యం కారణంగా అతడిని తప్పించి అశ్విన్‌ను తీసుకునే అవకాశాలు తక్కువ. ఆంధ్ర ఆటగాడు విహారికి స్థానంపై కూడా ఆసక్తి నెలకొంది. ఆరో బ్యాట్స్‌మన్ తనకు అవసరం లేదని కోహ్లి పదే పదే చెబుతుండటంతో విహారి అవకాశాలకు దెబ్బ పడుతోంది. సిడ్నీ టెస్టు గాయం నుంచి కోలుకున్న తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ మొదలు ఇప్పటి వరకు విహారి మరో మ్యాచ్ ఆడలేకపోయాడు. పుజారా మళ్లీ ఫామ్‌లోకి రాగా, కోహ్లి కూడా లయ అందుకున్నాడు. లార్డ్స్‌లో అర్ధ సెంచరీ మినహా మిగతా సిరీస్‌లో విఫలమైనా... వైస్ కెప్టెన్ రహానేను తప్పించే సాహసం చేయకపోవచ్చు. 2018 పర్యటనలో ఓవల్ టెస్టుతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పంత్ ఇప్పుడైనా రాణించాల్సి ఉంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ శుభారంభం ఇస్తుండటం భారత్‌కు సానుకూలాంశం. వోక్స్‌కు అవకాశం... సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకోరాదని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. కెప్టెన్ రూట్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ భీకర ఫామ్‌లో ఉండి జట్టును నడిపిస్తున్నాడు. రూట్‌ను నిలువరించడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గత టెస్టులో చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌కు బర్న్స్, హమీద్ రూపంలో ఓపెనింగ్ కలిసి రావడంతో పాటు పునరాగమనంలో మలాన్ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. వ్యక్తిగత కారణాలతో బట్లర్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో బెయిర్‌స్టో కీపింగ్ చేయనుండగా... ఒలీ పోప్ బ్యాట్స్‌మన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మొయిన్ అలీ కీలకం కానున్నాడు. ముగ్గురు పేసర్లు జోరులో ఉండగా ఒక కీలక మార్పు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థానంలో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బరిలోకి దిగుతాడు. కరన్‌తో పోలిస్తే వోక్స్ బౌలింగ్‌లో పదును ఎక్కువగా ఉండటంతో ఇంగ్లండ్ పేస్ దళం మరింత పటిష్టంగా మారింది. తుది జట్లు అంచనా భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, జడేజా, శార్దుల్/అశ్విన్, బుమ్రా, సిరాజ్, షమీ/ఉమేశ్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, హమీద్, మలాన్, పోప్, బెయిర్‌స్టో, అలీ, వోక్స్, ఒవర్టన్, రాబిన్సన్, అండర్సన్. పిచ్, వాతావరణం భారత్ తరహాలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఆపై స్పిన్‌కు సహకరిస్తుంది. వాతావరణం పొడిగా, వేడిగా ఉండనుంది. వర్షసూచన లేదు. 1971లో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు విజయం తర్వాత భారత్ ఇప్పటి వరకు ఓవల్‌లో మళ్లీ గెలవలేదు. 3 మ్యాచ్‌లు ఓడిన జట్టు మరో 5 ‘డ్రా’ చేసుకుంది. -
మూడో టెస్టులో టీమిండియా పరాభవం
లీడ్స్: ప్రత్యర్థి పేస్ ముందు ఎదురునిలువలేకపోయిన కోహ్లి బృందం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. గత రెండు టెస్టులకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో టీమిండియా బోల్తా పడింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 215/2తో నాలుగో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాబిన్సన్ (5/65), ఓవర్టన్ (3/47) భారత్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. చేతిలో 8 వికెట్లున్న భారత్ నాలుగో రోజు ఉదయం సెషన్లో ఇరవై ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 63 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. చదవండి: Innings Defeat: మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే.. అప్పుడు, ఇప్పుడు అండర్సనే ఇలా మొదలైంది... పతనం! కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న పుజారా (189 బంతుల్లో 91;15 ఫోర్లు) ఆరంభంలోనే అవుటవ్వడంతో భారత్ పతనం మొదలైంది. రాబిన్సన్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రూట్ రివ్యూకెళ్లి వికెట్ సాధించాడు. క్రితం రోజు స్కోరు వద్ద టీమిండియా ఈ కీలకమైన వికెట్‌ను కోల్పోయింది. ఇదే పెద్ద దెబ్బనుకుంటే... ఇక్కడితోనే ఖేల్ఖతమయ్యే దెబ్బలు పడ్డాయి. 237 స్కోరు వద్ద కోహ్లి (125 బంతుల్లో 55; 8 ఫోర్లు), మరో రెండు పరుగులు జత కాగానే రహానే (25 బంతుల్లో 10; 2 ఫోర్లు)... ఆ వెంటే రిషభ్ పంత్ (7 బంతుల్లో 1) రెండు పరుగుల వ్యవధిలో ముగ్గురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. మిగిలిన వారిలో జడేజా ఉన్నా, వెనుకంజలో ఉన్న స్కోరును... ముందుకు తీసుకెళ్లె ఇంకో బ్యాట్స్‌మన్ అయితే లేడు. షమీ (6), బుమ్రా (1 నాటౌట్) లార్డ్స్‌లో ఒక సెషన్ ఆడారేమో కానీ... ఇక్కడ పునరావృతం చేయలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ పేస్ బుల్లెట్లకు భారత్ వికెట్లను సమర్పించుకోవడం తప్ప చేయ గలిగిందేమీ లేకపోయింది. జడేజా (25 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో జట్టు స్కోరు 278 పరుగుల దాకా వెళ్లింది. చదవండి: Viral Video: ఆండర్సన్ బౌలింగ్ చేస్తుంటే పంత్ ఏం చేస్తున్నాడో చూడండి.. ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 78; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్ 59; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్ 8; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్ 91; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 55; రహానే (సి) బట్లర్ (బి) అండర్సన్ 10; పంత్ (సి) ఓవర్టన్ (బి) రాబిన్సన్ 1; జడేజా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 30; షమీ (బి) మొయిన్ అలీ 6; ఇషాంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 2; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్) 278. వికెట్ల పతనం: 1–34, 2–116, 3–215, 4–237, 5–239, 6–239, 7–254, 8–257, 9–278, 10–278. బౌలింగ్: అండర్సన్ 26–11–63–1, రాబిన్సన్ 26–6–65–5, ఓవర్టన్ 18.3–6–47–3, స్యామ్ కరన్ 9–1–40–0, మొయిన్ అలీ 14–1–40–1, రూట్ 6–1–15–0. -
బెంబేలెత్తించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా చిత్తుచిత్తు
ఢాకా: సీనియర్ల గైర్హాజరీలో అంతగా అనుభవం లేని ప్లేయర్లతో బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు దారుణ ప్రదర్శనతో సిరీస్‌ను ముగించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో (టి20, వన్డేలు) ఆ్రస్టేలియాకిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ముందువరకు కూడా 2005లో ఇంగ్లండ్‌పై చేసిన 79 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. చివరి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. టి20ల్లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ ఓటమి. గత నెలలో విండీస్ చేతిలో ఆస్ట్రేలియా 1–4తో ఓడింది. తొలుత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగుల చేసింది. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో ఆ్రస్టేలియా 13.4 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌటై ఓడింది. తాత్కాలిక సారథి వేడ్ (22 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), బెన్ మెక్‌డెర్మట్ (16 బంతుల్లో 17; 1 సిక్స్) మినహా మిగతా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (4/9), సైఫుద్దీన్ (3/12) ప్రత్యర్థిని పడగొట్టారు. సిరీస్‌లో ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేసిన షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌తో షకీబ్ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ (107) అగ్రస్థానంలో ఉన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత్‌తో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న స్టోక్స్
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆందోళనకు గురవుతున్న తాను, కొంత సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత్‌తో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అతను ఆడబోవడం లేదు. గత ఏడాది కాలంలో ‘బయో బబుల్’ల కారణంగా స్టోక్స్ ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నాడు. స్టోక్స్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ను ఇంగ్లండ్ జట్టులోకి ఎంపిక చేశారు. -
ప్రాక్టీస్ మ్యాచ్‌తో మొదలు...
డర్హమ్: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సన్నాహాలను షురూ చేసింది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ మళ్లీ గ్రౌండ్లోకి అడుగు పెట్టనుంది. నేటి నుంచి 3 రోజులపాటు కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తో కోహ్లి జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 4 నుంచి మొదలయ్యే సిరీస్‌కు ముందు జరిగే ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే కావడంతో పూర్తిగా ఉపయోగించుకునేందుకు భారత్ సిద్ధమైంది. రెండు వారాల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా తేలిన రిషభ్ పంత్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కీపర్‌గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. -
నెగెటివ్ వస్తేనే క్వారంటైన్‌కు...
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టుకు బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో టీమిండియా 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు వీరంతా తమ ఇంటి వద్దే మూడుసార్లు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. అందులో ప్రతీసారి నెగెటివ్ అని తేలితేనే ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే క్వారంటైన్‌కు అనుమతి లభిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. క్వారంటైన్ పూర్తయ్యాక జూన్ 2న ఇంగ్లండ్‌కు భారత జట్టు పయనం కానుంది. ఈ పర్యటనలో పాల్గొనే భారత ఆటగాళ్లందరూ ఇప్పటికే కోవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకోగా... రెండో డోస్‌ను ఇంగ్లండ్‌లో తీసుకునేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. సాహా, ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితేంటి? ఐపీఎల్ బయో బబుల్‌లో ఉంటూ కరోనా పాజిటివ్‌గా తేలిన సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, తన ఇంటికి చేరుకున్నాక వైరస్ బారిన పడ్డ ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితి అయోమయంగా ఉంది. అందుకు కారణం వారికి ఇంకా నెగెటివ్ రిపోర్టు రాకపోవడమే. సాహా రెండో వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో స్థానం పొందగా... స్టాండ్ బై బౌలర్‌గా ప్రసిధ్ ఎంపికయ్యాడు. తాజాగా సాహాకు నిర్వహించిన రెండు కరోనా పరీక్షల్లో ఒక దాంట్లో నెగెటివ్ అని మరో దాంట్లో పాజిటివ్ అని తేలింది. దాంతో అతను క్వారంటైన్‌లోనే మరికొన్ని రోజులు ఉండాల్సి ఉంది. ప్రసి«ధ్ కూడా ఇంకా తన క్వారంటైన్‌ను పూర్తి చేయలేదు. మే 25లోపు వీరిద్దరూ ముంబైలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. లేకపోతే ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడ్డారు ఐపీఎల్‌కు సంబంధించిన మరో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌పై అపో హలతో పలువురు భారత క్రికెటర్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడ్డారని సమాచారం. సీజన్ ఆరంభానికంటే ముందుగా పలు ఫ్రాంచైజీలు వ్యాక్సిన్ డోస్‌లను ఏర్పాటు చేస్తామని తమ ఆటగాళ్లకు తెలియజేసినా... వాటిని వేయించుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందనే భావనలో కొందరు... బయో బబుల్‌లో ఉండగా వ్యాక్సిన్ ఎందుకని మరి కొందరు వాటికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ప్లేయర్లు వ్యాక్సిన్‌పై అయిష్టతతో ఉండటంతో... తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వారిపై ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా ఒత్తిడి చేయలేకపోయాయని సమాచారం. మైక్ హస్సీకి ఊరట... కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకి ఊరట లభించింది. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన నిషేధం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దాంతో హస్సీ ఆస్ట్రేలియాకు ఇక్కడి నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. -
విహారి, షమీ, జడేజా పునరాగమనం
-
విహారి, షమీ, జడేజా పునరాగమనం
ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయకపోవడం మినహా ఎలాంటి అనూహ్యత లేకుండా అంచనాల ప్రకారమే జట్టు ఎంపిక సాగింది. కరోనా నేపథ్యంలో అదనంగా మరో నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు ప్రధాన జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు వెళతారు. ముంబై: సుమారు మూడు నెలల పాటు సాగే ఆరు టెస్టు మ్యాచ్‌ల ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్‌కు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది. ఈ టూర్లో జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే టీమిండియా... ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పోటీపడుతుంది. క్వారంటైన్ తదితర నిబంధనలు దృష్టిలో ఉంచుకొని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ బయలుదేరే అవకాశం ఉంది. ముగ్గురు వచ్చేశారు... ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ గాయపడగా... సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా గాయపడ్డారు. ఈ ముగ్గురు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు వీరు తాజా పర్యటనతో టెస్టు టీమ్‌లోకి పునరాగమనం చేస్తున్నారు. విహారి ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్నాడు. వార్విక్షైర్ క్లబ్ జట్టు తరఫున అతను కౌంటీల్లో ఆడుతున్నాడు. ఉమేశ్‌కు మరో చాన్స్... పేస్ బౌలింగ్ విభాగంలో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, షమీలతో పాటు తాజా ఫామ్‌ను బట్టి మొహమ్మద్ సిరాజ్‌కు సహజంగానే చోటు లభించింది. మరో ఇద్దరు పేసర్లు కూడా టీమ్‌లో ఉన్నారు. మెల్బోర్న్ టెస్టు తర్వాత అవకాశం దక్కని ఉమేశ్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అతనితో పాటు బ్రిస్బేన్ టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన శార్దుల్ ఠాకూర్‌కు కూడా చోటు లభించింది. వీరిద్దరు కూడా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ కుమార్‌ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌కు ముందు అతను ఇంగ్లండ్‌తో టి20, వన్డేలు ఆడాడు. ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితుల్లో భువీ తన స్వింగ్ బౌలింగ్‌తో మంచి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతనికి స్థానం ఖాయమనిపించింది. అయితే సెలక్టర్లు మరోలా ఆలోచించారు. పదే పదే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న భువీపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేకపోయారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన నవదీప్ సైనీని కూడా ఎంపిక చేయలేదు. కుల్దీప్ యాదవ్‌పై వేటు... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఫిట్‌గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లి పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే చివరకు అతనికీ టెస్టు అవకాశం దక్కలేదు. తాజా ఫిట్నెస్తో హార్దిక్ బౌలింగ్ చేయడం కష్టమని సెలక్టర్లు భావించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై కూడా వేటు పడింది. గత రెండేళ్లలో ఒకే ఒక టెస్టులో ఆడే అవకాశం లభించిన కుల్దీప్ (ఇంగ్లండ్‌తో రెండో టెస్టు) మొత్తం కలిపి 12.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఉండగా అవసరమైతే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తనను తాను నిరూపించుకున్న అక్షర్ పటేల్ (27 వికెట్లు) కూడా ఎంపికయ్యాడు. కాబట్టి కుల్దీప్కు తుది జట్టులో స్థానం కష్టం కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా చెలరేగినా... పృథ్వీ షాను టెస్టుల కోసం సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే... బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా 20 మంది సభ్యుల బృందంలోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు బయలుదేరేలోపు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌కు ఇటీవలే అపెండిసైటిస్ ఆపరేషన్ జరగ్గా... సాహా కరోనా వైరస్ బారిన పడ్డాడు. సాహాకు ప్రస్తుతం కరోనా చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా కోలుకోలేదు. ఆ నలుగురు... ప్రసిధ్ కృష్ణ: ఐపీఎల్లో కోల్‌కతా జట్టు తరఫున ఆడినప్పుడు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కర్ణాటక బౌలర్ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసిన అతను 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 20.26 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్: మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్‌కు ఆరేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఉంది. 26 మ్యాచ్‌లలో అతను 23.01 సగటుతో 100 వికెట్లు తీశాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో అతని ఆట ఎంతో మెరుగుపడింది. తాజా ఐపీఎల్‌లోనూ అది కనిపించింది. అభిమన్యు ఈశ్వరన్: రంజీల్లో ప్రతీ సీజన్లో నిలకడగా రాణిస్తున్నా దురదృష్టవశాత్తూ ఈ బెంగాల్ ఓపెనర్‌కు ఇప్పటి వరకు టీమిండియా పిలుపు రాలేదు. 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో అతను 43.57 సగటుతో 4,401 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. అర్జాన్ నాగ్వాస్వాలా: గుజరాత్‌కు చెందిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్. 16 మ్యాచ్‌లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. 2019–20 రంజీ సీజన్లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న ఏకైక ‘పార్సీ’ ఆటగాడు అతనే కావడం విశేషం. భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్, గిల్, మయాంక్, పుజారా, విహారి, పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దుల్, ఉమేశ్, రాహుల్, సాహా. స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాలా -
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత్
లండన్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆగస్టు–సెప్టెంబర్ 2021లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ తేదీలను వేదికలతో సహా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 ఆగస్టులో ఈ గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన కోహ్లి సేన మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుంది. దీంతో పాటు స్వదేశంలో శ్రీలంకతో జరిగే 3 వన్డేలు... పాకిస్తాన్‌తో జరిగే 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ఈసీబీ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఏడాది భారీగా నష్టపోయిన ఇంగ్లండ్ బోర్డు వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. అన్నింటికంటే ఎక్కువగా భారత్–ఇంగ్లండ్ మధ్య పోరునే ‘సెంటర్ పీస్ ఈవెంట్’గా భావిస్తూ ఎక్కువ ఆదాయాన్ని ఈసీబీ ఆశిస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు (ఆగస్టు 4–8), లార్డ్స్‌లో రెండో టెస్టు (ఆగస్టు 12–16), లీడ్స్‌లో మూడో టెస్టు (ఆగస్టు 25–29), ఓవల్‌లో నాలుగో టెస్టు (సెప్టెంబర్ 2–6), మాంచెస్టర్‌లో ఐదో టెస్టు (సెప్టెంబర్ 10–14) జరుగుతాయి. పాకిస్తాన్‌లోనూ...: 16 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ టీమ్ పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 14, 15 తేదీల్లో పాక్‌తో (కరాచీ వేదిక) రెండు టి20ల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ సిరీస్ అనంతరం రెండు జట్లు కలిసి భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు బయల్దేరతాయి. 2005లో చివరిసారి ఇంగ్లండ్ జట్టు 3 టెస్టులు, 5 వన్డేల కోసం పాకిస్తాన్లో పర్యటించింది. -
ప్రతీకారానికి ‘ప్రాక్టీస్’
ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన మొదలు నేటి నుంచి లెస్టర్‌తో మూడు రోజుల మ్యాచ్ లీసెస్టర్: సరిగ్గా మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 0-4 తేడాతో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన ధోనిసేన... ఆ పర్యటనలో కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ మూడేళ్లలో పరిస్థితి మారింది. ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన పేలవంగా మారింది. కాబట్టి గత సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇదే లక్ష్యంతో ఇంగ్లండ్ చేరిన భారత్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు... నేటి నుంచి తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. లెస్టర్‌షైర్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో దాదాపుగా ప్రధాన ఆటగాళ్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత పర్యటనలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్నా కూడా భారత్ చిత్తుగా ఓడింది. అప్పటి జట్టులో ఉన్న ధోని, గంభీర్, ఇషాంత్ శర్మలకు మాత్రమే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. కోహ్లి, పుజారాలాంటి యువ క్రికెటర్లందరికీ ఈ సిరీస్ పెద్ద పరీక్ష.