Old Trafford Stadium
-
డ్రా చేసుకున్నా చాలు.. సిరీస్ మనదే
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 2007లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఆడిన మూడు సిరీస్‌లలో 0–4, 1–3, 1–4తో ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి పటౌడీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం టీమిండియా ముంగిట నిలిచింది. కోహ్లి సేన కనీసం మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా చాలు. ఇంగ్లండ్ మాత్రం స్వదేశంలో సిరీస్ కోల్పోకుండా ఉండాలనే తప్పనిసరిగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఉంది. మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఈ టూర్ కోసం ఇంగ్లండ్‌లో అడుగు పెట్టి నేటితో సరిగ్గా వంద రోజులు! ఈ ‘సెంచరీ’లో డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి, ఇంగ్లండ్‌పై రెండు అద్భుత విజయాలు, ఒక పరాజయం ఉన్నాయి. తమ పర్యటనను చిరస్మరణీయం చేసుకునే క్రమంలో టీమిండియా ఇప్పుడు చివరి ఘట్టాన నిలిచింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటినుంచి జరిగే చివరి పోరులో భారత్ తలపడనుంది. విహారికి అవకాశం ఉందా! కెపె్టన్ కోహ్లి లెక్క ప్రకారం చూస్తే గత మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టులో ఎలాంటి మార్పూ అవసరం లేదు. రోహిత్, పుజారా, జడేజా స్వల్ప గాయాలతో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా...మ్యాచ్ సమయానికి వారంతా సిద్ధమవడం ఖాయం. ఇంగ్లండ్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసేందుకు మరోసారి నాలుగు పేసర్ల వ్యూహాన్నే కోహ్లి కోరుకుంటే అశి్వన్ ఈ మ్యాచ్‌లోనూ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే అశి్వన్‌ను చోటు కలి్పంచవచ్చని చర్చ జరుగుతున్నా...ఇంకా సిరీస్ గెలవలేదు కాబట్టి మేనేజ్మెంట్ అలాంటి సాహసం చేయకపోవచ్చు. అయితే ఒకే ఒక స్థానం విషయంలో మాత్రం కొంత అనిశ్చితి ఉంది. సిరీస్ మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో కలిపి 109 పరుగులే చేసిన రహానేకు మరో అవకాశం ఇస్తారా అనేదే చూడాలి. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్న రహానేను తప్పించాలని అనుకుంటే ఆరో స్థానంలో విహారి సరైన వ్యక్తి కాగలడు. జట్టు మొత్తం ఓవల్ తరహాలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే టీమిండియాను నిలువరించడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమవుతుంది. రూట్ మినహా... గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ జట్టు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఎప్పుడూ లేదు. భారత్‌తో సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన రూట్ సేన వరుసగా రెండో సిరీస్ ఓడిపోయే ప్రమాదంలో నిలిచింది. సొంతగడ్డపై కూడా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పేలవంగా ఆడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన కెపె్టన్ రూట్ గత మ్యాచ్‌లోనూ జట్టును రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అతను తప్ప మరో బ్యాట్స్‌మన్‌ను నమ్మలేని పరిస్థితిలో ఇంగ్లండ్ ఉంది. కీపర్‌గా బట్లర్ మళ్లీ టీమ్‌లోకి వచి్చనా తొలి మూడు టెస్టుల్లోనూ అతను రాణించింది లేదు. అయితే ఆ జట్టుకు పెద్దగా ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో లేవు. ఓవల్‌లో పోప్ రాణించడంతో ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోపై వేటు ఖాయమైంది. సీనియర్ స్టార్ అండర్సన్‌కు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన ఉన్నా...సొంత మైదానంలో జిమ్మీ అందుకు ఇష్టపడకపోవచ్చు. మొత్తంగా ఇంగ్లండ్ మ్యాచ్ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్ తమ శక్తికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంది. అసిస్టెంట్ ఫిజియోకు కరోనా సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నా మ్యాచ్ జరిగే విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా ‘పాజిటివ్’గా తేలడమే అం దుకు కారణం. గత నాలుగు రోజులుగా యోగేశ్... గాయాలతో ఇబ్బంది పడుతున్న జట్టు సభ్యులు రోహిత్, పుజారా, షమీ, జడేజాలకు ఫిజియోగా తన సేవలు అందించాడు. ప్రధాన ఫిజియో నితిన్ పటేల్ ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉండటంతో పర్మార్ ఎక్కువ సమయం టీమిండియా ఆటగాళ్లతో గడపాల్సి వచి్చంది. మ్యాచ్ ముందు రోజు టీమ్ ప్రాక్టీస్ కూడా రద్దయింది. గురువారం రాత్రి వచి్చన నివేదికల్లో జట్టు సభ్యులంతా ‘నెగెటివ్’గా తేలారు. అయితే సహజంగానే కోవిడ్ లక్షణాలు కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉండటంతో మ్యాచ్‌కు ఏమైనా అంతరాయం కలుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ అనూహ్యంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే సిరీస్‌లో విజేతను ప్రకటించకుండా అసంపూర్తిగా ముగించి తర్వాతి రోజుల్లో విడిగా ఈ ఒక్క టెస్టును నిర్వహించేందుకు అవకాశం ఉంది. -
'ఢమాల్' సేన!
0,4,0,0... ఏమిటి అంకెలు అనుకుంటున్నారా. టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్ సాధించిన పరుగులివి. అవాక్కయ్యారా. ఇంగ్లండ్ తో మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టు తొలి రోజున వారీ స్కోరు సాధించారు. అంతేకాదు అదే రోజు ఆరుగురు ఆటగాళ్లు డకౌటై రికార్డు కూడా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా రికార్డు కూడా సమం చేశారు. నాయకుడు ధోని ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరు మూడంకెలు దాటించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ 'టాప్' స్టోరీ మారలేదు. కనీస సమర స్ఫూర్తి చూపకుండానే చేతులెత్తేశారు. 66 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుని చాప చుట్టేశారు. ఇంగ్లీషు టీమ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి అపకీర్తి మూట కట్టుకున్నారు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కుక్ సేనను కంగుతినిపించిన జట్టు ఇదేనా అన్నంత చెత్తగా ఆడి అభాసుపాలయ్యారు. మూడు, నాలుగు టెస్టుల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగానే ధోని సేన ఢమాల్ అయింది. లార్డ్స్ టెస్టులో రాణించిన రహానే ఒక్కడే మూడో టెస్టులోనూ రెండు అర్థ సెంచరీలు చేసి ఫర్వాలేదనిపించాడు. విదేశీ గడ్డపై మంచి రికార్డు వున్న విరాట్ కోహ్లి ఈ సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగో టెస్టులోనూ పరిస్థితి మారలేదు. టాప్ ఆర్డర్ మూకుమ్మడిగా ప్రత్యర్థి ముందు మోకరిల్లారు. ఐదో బౌలర్ గా జట్టులోకి వచ్చిన అశ్విన్ వీరి కంటే నయమనిపించాడు. అశ్విన్ ఒక్కడే చేసినన్ని పరుగులు కూడా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు చేయలేకపోయారంటే వారెంత దారుణంగా ఆడారో అర్థమవుతుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే2-1తో వెనుకబడిన ధోని సేన చివరి టెస్టులోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. -
టాప్ ఆర్డరే కొంప ముంచింది: ధోని
మాంచెస్టర్: టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యమే తమ కొంప ముంచిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వాపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మూడంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరగడంతో తాము ఘోరంగా ఓడిపోయామని చెప్పాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో విజయం సాధించడంతో టాప్ ఆర్డర్ ఆటగాళ్ల వైఫల్యం కనపించకుండాపోయిందని, మరిన్ని పరుగులు చేయాల్సిందని వారికి చెప్పలేని పరిస్థితి తలెత్తిందన్నాడు. తమ ఐదో బౌలర్ చేసినన్ని పరుగులు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్మన్ సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగులతో చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్సలో భారత్ 8 పరుగలకే 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. -
ఇంగ్లండ్ జోరుకు వరుణుడు బ్రేక్
మాంచెస్టర్: నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేశాడు. ఆట రెండో రోజు టీ విరామ సమయానికి కుక్ సేన 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో భారత్ పై 85 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. రూట్ 48, బట్లర్ 22 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. బెల్(58) అర్థ సెంచరీ సాధించాడు. జొర్డాన్ 13, అలీ 13 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఆరోన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 152 పరుగులకు ఆలౌటైంది. -
అరడజను సున్నాలు.. ఆరు వికెట్లు..
మాంచెస్టర్: భయపడినంతా అయింది. చారిత్రక ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో తమకున్న చెత్త రికార్డును భారత్ క్రికెట్ టీమ్ కొనసాగించింది. ఇంగ్లండ్ తో గురువారమిక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ భారత ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. ఆరు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. ఆండర్సన్ 3 వికెట్లు తీసి బ్రాడ్ కు అండగా నిలిచాడు. ఇంగ్లీషు బౌలర్ల ధాటికి 8 పరుగులకే టీమిండియా టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరింది. ఆరుగురు పరుగులేమీ చేయకుండానే చేతులెత్తేశారు. విజయ్, పుజారా, కోహ్లి, జడేజా, భువనేశ్వర్ కుమార్, పంకజ్ సింగ్ డకౌటయ్యారు. గౌతమ్ గంభీర్ 4 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోని(71), ఆశ్విన్(40), రహానే(24) పోరాటంతో టీమిండియా ఆమాత్రమైనా స్కోరు చేయగలిగింది. భారత్ బ్యాటింగ్ 46.4 ఓవర్లలోనే ముగిసింది. జోర్డన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.