కేఎల్ రాహుల్, సూర్య అర్థ శతకాలు.. తొలి టి20లో టీమిండియా ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా శుభారంభం చేసింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులతో రాణించారు.
అంతకముందు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో వేన్ పార్నెల్(19), మార్క్రమ్(25) పరుగులు చేసి ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 41 పరుగులు) చేయడంతో సౌతాఫ్రికా స్కోరు వంద దాటింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, దీపక్ చహర్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
రోహిత్ శర్మ ఔట్.. తొలి వికెట్ డౌన్
►107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ రబడా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 6, కోహ్లి 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సౌతాఫ్రికా 106/8.. టీమిండియా టార్గెట్ 107
►టీమిండియాతో తొలి టి20లో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో వేన్ పార్నెల్(19), మార్క్రమ్(25) పరుగులు చేసి ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 41 పరుగులు) చేయడంతో సౌతాఫ్రికా స్కోరు వంద దాటింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, దీపక్ చహర్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరెంతంటే?
►15 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. వేన్ పార్నెల్ 20, కేశవ్ మహరాజ్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు దీపక్ చహర్, అర్ష్‌దీప్‌లు విజృంభించడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
►మార్ర్కమ్ రూపంలో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పార్నెల్ 13, మహరాజ్ 4 పరుగులతో ఆడుతున్నారు.
5 wickets summed up in 11 seconds. Watch it here 👇👇
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia pic.twitter.com/jYeogZoqfD
— BCCI (@BCCI) September 28, 2022
9 పరుగులకే ఐదు వికెట్లు డౌన్..
►సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. దీపక్ చహర్, అర్ష్‌దీప్ బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తాజాగా ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయగా... ఆ తర్వాత దీపక్ చహర్ మరో వికెట్ తీశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది.
సౌతాఫ్రికాకు షాక్.. ఒక్క పరుగుకే రెండు వికెట్లు డౌన్
►టీమిండియాతో తొలి టి20లో సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో దీపక్ చహర్ బవుమాను డకౌట్ చేయగా.. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ క్వింటన్ డికాక్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
►స్వదేశంలో మరో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీ ఆరంభానికి ముందు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతోంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి టి20లో టీమిండియా టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది. ఇక తొలి టి20 బుమ్రా, చహల్‌కు రెస్ట్ ఇవ్వగా.. వారి స్థానంలో దీపక్ చహర్, అర్ష్‌దీప్‌లు తుది జట్టులోకి వచ్చారు.
దక్షిణాఫ్రికాతో ఇప్పటివరకు భారత్ 20 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో దక్షిణా ఫ్రికా గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ 2006లో డిసెంబర్ 1న జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ఒక్కడే తాజా సిరీస్ లోనూ ఆడుతున్నాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
🚨 Team News 🚨
A look at #TeamIndia's Playing XI for the first #INDvSA T20I 🔽
Follow the match ▶️ https://t.co/L93S9jMHcv pic.twitter.com/Uay6kuQJbE
— BCCI (@BCCI) September 28, 2022
Comments
Please login to add a commentAdd a comment