44 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. భారత మ‌హిళ‌ల హాకీ జ‌ట్టుకు స్వ‌ర్ణం | India Women Hockey Ends 44 Years Wait-Won Gold Medal-Vs China-Asian Games | Sakshi
Sakshi News home page

Asian Games: 44 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. భారత మ‌హిళ‌ల హాకీ జ‌ట్టుకు స్వ‌ర్ణం

Oct 2 2026 5:59 PM | Updated on Oct 2 2026 6:34 PM

India Women Hockey Ends 44 Years Wait-Won Gold Medal-Vs China-Asian Games

Photo Credit: Twitter

ఆసియా గేమ్స్‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు అద‌ర‌గొట్టింది. 44 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ మ‌న అమ్మాయిలు హాకీలో స్వ‌ర్ణంతో మెరిశారు. శుక్ర‌వారం జ‌రిగిన ఫైన‌ల్లో భార‌త్ 1-0 తేడాతో ప‌టిష్టమైన‌ చైనాను ఓడించి ప‌సిడి ప‌త‌కాన్ని అందుకోగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ రజతానికే పరిమితమైంది.

మ్యాచ్‌లో ఏకైక గోల్ ఆట 10వ నిమిషంలో భార‌త ప్లేయ‌ర్ లాల్‌రెమ్‌సియామి లెఫ్ట్ సైడ్ సర్కిల్ నుంచి బంతిని నెట్‌లోకి పంపించి భార‌త్‌కు ఆధిక్యాన్ని అందించింది. ఆ త‌ర్వాత చైనా ప్లేయ‌ర్ల అటాకింగ్ గేమ్‌ను స‌మ‌ర్థంగా అడ్డుకుంది. చైనా ఆటగాళ్లు సంధించిన పెనాల్టీ స్ట్రోక్‌లను కూడా భారత ఆటగాళ్లు నిర్వీర్యం చేయడంలో సఫలమయ్యారు.

స్వ‌ర్ణంతో 2028 ఒలింపిక్స్‌కు అర్హత
గ‌తంలో 1982లో ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఆసియా గేమ్స్‌లో మ‌హిళ‌ల హాకీ ఫైన‌ల్లో భార‌త్ 22-0తో హాంకాంగ్‌పై ఏకప‌క్ష విజ‌యంతో స్వ‌ర్ణం ఎగ‌రేసుకుపోయింది. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల హాకీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతున్న భార‌త్ లీగ్ ద‌శ‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించి మంచి ఆత్మ‌విశ్వాసాన్ని కూడ‌గ‌ట్టుకుంది. 

ఇదే జోరును తాజాగా ఫైనల్లో చైనాపై కూడా ప్రదర్శించిన భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. అంతేకాదు ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలవడం ద్వారా భారత మహిళల హాకీ జట్టు 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడం విశేషం.

ఒక్కరోజే ఆరు స్వర్ణాలు..
ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 16వ స్వర్ణం కాగా.. శుక్రవారం ఒక్కరోజే భారత్‌కు ఆరు స్వర్ణాలు రావడం విశేషం. ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో ఒకటి రాగా.. తాజాగా మహిళల హాకీ జట్టు కూడా స్వర్ణం సాధించడంతో భారత్‌ పతకాల సంఖ్య 76కు పెరిగింది. ఇందులో 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి. పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. 

 

ఇదీ చదవండి: బాక్సర్ల పసిడి పంచ్‌.. భార‌త్ ఖాతాలో 75వ ప‌త‌కం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement