బాక్సర్ల పసిడి పంచ్‌.. భార‌త్ ఖాతాలో 75వ ప‌త‌కం | Parveen Hooda Strikes Gold Women-65kg Boxing-India-13 Gold-Asian Games | Sakshi
Sakshi News home page

బాక్సర్ల పసిడి పంచ్‌.. భార‌త్ ఖాతాలో 75వ ప‌త‌కం

Oct 2 2026 3:12 PM | Updated on Oct 2 2026 4:10 PM

Parveen Hooda Strikes Gold Women-65kg Boxing-India-13 Gold-Asian Games

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు స్వర్ణాల పంచ్‌ కురిపిస్తున్నారు. ఇప్పటికే లవ్లీనా స్వర్ణంతో మెరవగా, తాజాగా పర్వీన్‌ హుడాతో పాటు అంకుశ్‌ బంగారు పతకాలు సాధించారు. మహిళల 65 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ పర్వీన్ హుడా పసిడి పతకం ముద్దాడింది. ఫైనల్​లో చైనీస్ తైపీకి చెందిన చెన్ నిన్ చెన్​ను పర్వీన్ 3-2 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో పసిడి సాధించిన భారత మూడో అథ్లెట్​గా పర్విన్ అరుదైన ఘనత సాధించింది. 

పురుషుల 80 కేజీల విభాగం ఫైనల్లో‌ అంకుశ్‌ 4-0 తేడాతో కొరియా బాక్సర్‌ కిమ్‌ మిన్‌సోంగ్‌పై గెలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. కాగా తాజా స్వర్ణాలతో 2026 ఆసియా గేమ్స్​లో భారత్ ఖాతాలో 14 గోల్డ్ మెడల్స్ చేరాయి. ఉదయం బాక్సింగ్ 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గొహెయిన్​ కూడా పసిడి ముద్దాడింది. దీంతో ఆసియా గేమ్స్​లో 12ఏళ్ల తర్వాత బాక్సింగ్​లో పసిడి పతకం నెగ్గిన భారత మహిళా అథ్లెట్​గా లవ్లీనా రికార్డు కొట్టింది. 

ఈ విభాగంలో భారత్​కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ 2014లో వచ్చింది. 51 కేజీల ఈవెంట్​లో మెరీకోమ్ స్వర్ణ పతకం దక్కించుకుంది. ఇక 12ఏళ్ల తర్వాత ఒకేరోజు బాక్సింగ్​లో మూడు గోల్డ్ మెడల్స్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక రెజ్లింగ్‌లో సుజీత్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో స్వర్ణం సాధించాడు. దీంతో శుక్రవారం ఒక్కరోజే భారత్‌ ఖాతాలో 5 స్వర్ణాలు చేరగా.. ఆసియా గేమ్స్‌లో భార‌త్ ఖాతాలో 75 ప‌త‌కాలు చేరాయి. ఇందులో 15 స్వ‌ర్ణాలు, 25 ర‌జ‌తాలు, 35 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం భార‌త్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుంది. భారత్ కంటే ముందు చైనా (311 పతకాలు), జపాన్ (234), కొరియా (134), ఉజ్బెకిస్తాన్ (63) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: Asian Games 2026: రెజ్లింగ్‌లో భార‌త్‌కు తొలి స్వ‌ర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement