టాస్‌కు ముందు కోహ్లి, ధోని ఏం మాట్లాడుకున్నారు? | Intresting Chat Between MS Dhoni And Virat Kohli Before Toss Became Viral | Sakshi
Sakshi News home page

Dhoni-Kohli Chit Chat: టాస్‌కు ముందు కోహ్లి, ధోని ఏం మాట్లాడుకున్నారు?

Published Fri, Sep 24 2021 7:30 PM | Last Updated on Fri, Sep 24 2021 8:04 PM

Intresting Chat Between MS Dhoni And Virat Kohli Before Toss Became Viral - Sakshi

Photo Courtesy: IPL

MS Dhoni Chit Chat With Kohli.. ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌ 2021లో భాగంగా  నేడు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే షార్జాలో గాలి దుమారం కారణంగా టాస్‌ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. ఈ గ్యాప్‌లో విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని సీరియస్‌గా చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. ఫ్యాన్స్‌ మాత్రం మాకు తెలుసంటూ ట్విటర్‌లో కామెంట్స్‌ చేశారు. 

చదవండి: పొలార్డ్‌కే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్‌ చూసుకుంటా


Photo Courtesy: IPL

ఇక టి20 ప్రపంచకప్‌ 2021 దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఎంఎస్‌ ధోనిని మెంటార్‌గా నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇప్పటినుంచే టి20 ప్రపంచకప్‌ ప్రణాళికలు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. వీరి సంభాషణలో ధోని ఎక్కువగా మాట్లాడుతుంటే కోహ్లి అతను చెప్పింది సీరియస్‌గా వింటున్నట్లు కనిపించింది. ఆ తర్వాత కోహ్లి టి20 ప్రపంచకప్‌ అనంతరం ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుంది. అంతేగాక కోహ్లి ఈ సీజన్‌ తర్వాత కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 

చదవండి: ఆ బ్యాలెన్సింగ్‌లో కిర్రాక్‌ వెంకీ.. రైట్‌ టు లెఫ్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎందుకు మారాడంటే.


Photo Courtesy: IPL

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement