Photo Courtesy BCCI
చెన్నై: గత నెలలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డకౌటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో మాత్రం అజేయంగా 73 పరుగులు సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాను తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో స్నేహితుడు, ఆర్సీబీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సహకారం ఉందన్నాడు. తాను ఏబీ చేసిన సూచనలతోనే ఫామ్‌లోకి వచ్చినట్లు కోహ్లి తెలిపాడు. కాగా, ఆ విషయాలు ఏమిటనేది కోహ్లి అప్పుడు స్పష్టం చేయలేదు. తాజాగా కోహ్లీకి తాను ఏమి చెప్పాననే విషయాలను ఏబీ రివీల్ చేశాడు. ఆర్సీబీ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఏబీ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
‘నాకు కోహ్లీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో నాకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు. నేను ఏమీ చెప్పాలనుకోలేదు. అలా చెప్పడం కాస్త ఇబ్బందికరమే. గేమ్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ కొన్ని టెక్నికల్ విషయాలను కోహ్లీవద్ద ప్రస్తావించా. నేను కొన్ని నెలల నుంచి అతని గేమ్ ఆడిన విధానాన్ని పరిశీలించిన తర్వాత నాలుగు విషయాలు చెప్పాలనుకున్నా. అవి కూడా బేసిక్ విషయాలే. బంతిని చూడటం. హెడ్ పొజిషన్ కరెక్ట్‌గా చూసుకోవడం, బంతి నీ యొక్క స్పేస్‌లో ఉందా లేదా అనేది చూసుకోవడం, బాడీ లాంగ్వెజ్‌ను సరిచేసుకోవడం.. ఈ నాలుగు విషయాలపైనే విస్తృతంగా చర్చించాం’ అని ఏబీ తెలిపాడు.
ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. ఏబీకి మంచి మిత్రుడు. వీరిద్దరూ తరచు వ్యక్తిగత విషయాలను, క్రికెట్ పరమైన అంశాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై ఆర్సీబీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
ఇక్కడ చదవండి: ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు
ఐపీఎల్ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment