'తండ్రీ, కూతురు అదరగొట్టారు.. మనసు కరిగిపోయింది' | IPL 2021: Jos Buttler Helping Hand From Daughter While Exercising Viral | Sakshi
Sakshi News home page

'తండ్రీ, కూతురు అదరగొట్టారు.. మనసు కరిగిపోయింది'

Published Tue, Apr 6 2021 1:03 PM | Last Updated on Tue, Apr 6 2021 1:34 PM

IPL 2021: Jos Buttler Helping Hand From Daughter While Exercising Viral - Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు మైదానాల్లో ప్రాక్టీస్‌ చేస్తూ బిజీగా గడుపుతుంటే.. మరికొందరు క్వారంటైన్‌లో ఉంటూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ క్వారంటైన్‌లో ఉంటూ తన కూతురితో కలిసి కసరత్తు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో తొలుత బట్లర్‌ తన కూతురును ఎత్తుకొని పుష్‌ అప్స్‌ చేశాడు. ఆ తర్వాత బట్లర్‌ను అనుకరిస్తూ జార్జియా చేసిన ఫీట్స్‌ నవ్వులు పూయిస్తుంది. తండ్రీ కూతుళ్లు అదరగొట్టేశారు.. వీరిని చూస్తుంటే మా కోపం తగ్గిపోయి మనసులు కరిగిపోయాయి అంటూ కామెంట్‌ చేశారు. ఇటీవలే టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌కు జోస్‌ బట్లర్‌ ఇయాన్‌ మోర్గాన్‌ స్థానంలో నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇక బట్లర్‌ 2018 నుంచి ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సీజన్‌లో 548 పరుగులతో దుమ్మురేపే ప్రదర్శన చేసిన బట్లర్‌ 2019 ఐపీఎల్‌ సీజన్‌లో  ప్రపంచకప్‌ కారణంగా లీగ్‌ మధ్యలోనే వెనుదిరిగాడు. అయితే అతను ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే 311 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న ముంబై వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది.

చదవండి : 'గిల్‌ కరెక్ట్‌గానే ఉన్నాడు.. మీరు చెప్పాల్సిన పని లేదు'
రూ. 8 కోట్లు పెట్టి కొన్నారు.. మెరెడిత్‌కు స్థానం లేదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement