Jos Buttler: ఆ ముగ్గురి సరసన బట్లర్‌ | IPL 2021: Jos Buttler Hits His First IPL Hundred Off 56 Balls | Sakshi
Sakshi News home page

Jos Buttler: ఆ ముగ్గురి సరసన బట్లర్‌

Published Sun, May 2 2021 7:09 PM | Last Updated on Sun, May 2 2021 8:23 PM

IPL 2021: Jos Buttler Hits His First IPL Hundred Off 56 Balls - Sakshi

Photo Courtesy: PTI

ఢిల్లీ: ఇంగ్లండ్‌ క్రికెటర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సెంచరీ  చేయడం ద్వారా  ఈ ఫీట్‌ సాధించిన నాల్గో ఇంగ్లిష్‌ క్రికెటర్‌గా నిలిచాడు. ఇది బట్లర్‌కు ఐపీఎల్‌ తొలి సెంచరీ. ఫలితంగా కెవిన్‌ పీటర్సన్‌, బెన్‌ స్టోక్స్‌,  జోనీ బెయిర్‌ స్టోల సరసన నిలిచాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బట్లర్‌ 64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో  124 పరుగులు సాధించాడు.

56 బంతుల్లో శతకం పూర్తి చేసుకోవడం ద్వారా అరుదైన జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందువరకూ ఐపీఎల్‌లో బట్లర్‌  అత్యధిక వ్యక్తిగత స్కోరు 95. 2018 లో సీఎస్‌కేపై 95 పరుగులు సాధించాడు బట్లర్‌. దాన్ని తాజా మ్యాచ్‌లో అధిగమించాడు. కాగా, రాజస్థాన్‌ తరఫున రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని బట్లర్‌-సామ్సన్‌లు నమోదు చేశారు. రెండో  వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడి సాధించింది. ఏ  వికెట్‌కైనా రాజస్థాన్‌ అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు స్టోక్స్‌-సామ్సన్‌ల  పేరిట ఉంది. ముంబై ఇండియన్స్‌తో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌-సామ్సన్‌లు అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 

ఇక్కడ చదవండి: 
పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌: రాహుల్‌ ఔట్‌!

ఈ సీజన్‌కు వార్నర్‌ దూరం!

వార్నర్‌కు ఏమీ అర్థం కాలేదు: టామ్‌ మూడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement