రాజస్తాన్ రాయల్స్:
కెప్టెన్: సంజూ శామ్సన్
విజేత: 2008
2008 తొలి ఐపీఎల్ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ ఆ తర్వాత జరిగిన ఏ సీజన్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గతేడాది సీజన్‌లో స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆర్‌ఆర్ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. స్మిత్ కెప్టెన్‌గా విఫలమవడంతో అతని స్థానంలో సంజూ శామ్సన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. వేలానికి ముందు స్మిత్‌ను రిలీజ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర(రూ.16.25 కోట్లు)కు కొనుగోలు చేసింది.
చదవండి: పంత్ దూకుడు ఢిల్లీకి లాభిస్తుందా?
మోరిస్‌తో పాటు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియాలు ఆ జట్టుకు అదనపు బలం అని చెప్పొచ్చు. ఇక రాజస్తాన్ రాయల్స్ తాను ఆడే 14 లీగ్ మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ముంబైలో.. 4 మ్యాచ్‌లు ఢిల్లీలో.. 3 మ్యాచ్‌లు కోల్‌కతాలో.. రెండు మ్యాచ్‌లు బెంగళూరులో ఆడనుంది.
రాజస్తాన్ రాయల్స్ జట్టు:
బ్యాట్స్ మెన్: సంజూ శామ్సన్( కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, మహిపాల్ లోమ్రర్, మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), అనుజ్ రావత్
బౌలర్లు: జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహ్మాన్, కె.సి.కరియప్ప, ఆకాష్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఆల్‌రౌండర్లు: బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, శివం దుబే, లియామ్ లివింగ్‌స్టోన్ , శ్రేయాస్ గోపాల్
చదవండి: కేకేఆర్ షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లు
తేది | జట్లు | వేదిక | సమయం |
ఏప్రిల్ 12 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 15 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 19 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ సీఎస్‌కే | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 22 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్‌సీబీ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 24 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 29 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 2 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | ఢిల్లీ | సాయంత్రం 3.30 గంటలు |
మే 5 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ సీఎస్‌కే | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 8 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 11 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
మే 13 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
మే 16 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్‌సీబీ | కోల్‌కతా | సాయంత్రం 3.30 గంటలు |
మే 18 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ | బెంగళూరు | రాత్రి 7.30 గంటలు |
మే 22 | రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ | బెంగళూరు | రాత్రి 7.30 గంటలు |
Comments
Please login to add a commentAdd a comment