ముంబై: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఐపీఎల్ కెరీర్‌లో ఆరువేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ సాధించాడు. ఆర్సీబీ లక్ష్య ఛేదనలో భాగంగా క్రిస్ మోరిస్ వేసిన 13 ఓవర్ నాల్గో బంతిని ఫోర్ కొట్టడంతో కోహ్లి ఆరువేల ఐపీఎల్ పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఆరువేల పరుగుల పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ కోహ్లి 6,021 ఐపీఎల్ పరుగులు సాధించాడు. కోహ్లి తర్వాత స్థానంలో సురేశ్ రైనా(5448), శిఖర్ ధవన్(5,428), డేవిడ్ వార్నర్(5,384)లు వరుస స్థానాల్లో ఉన్నారు.
మూడో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పడిక్కల్..
ఈ మ్యాచ్‌లో దేవదూత్ పడిక్కల్ సెంచరీ చేయడం ద్వారా అరుదైన జాబితాలో చేరిపోయాడు. భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా సెంచరీ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు 2009లో మనీష్ పాండే(114 నాటౌట్), పాల్ వాల్తాటి(120 నాటౌట్)లు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వారి సరసన్ పడిక్కల్ చేరాడు. 2009లో మనీష్ పాండే ఈ ఘనత సాధించగా, 2011లో వాల్తాటి ఈ ఫీట్‌ను చేరాడు. సుమారు పదేళ్ల తర్వాత ఒక భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సెంచరీ చేశాడు.
చదవండి: పడిక్కల్ ఫటాఫట్...
Comments
Please login to add a commentAdd a comment