అహ్మదాబాద్: ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ ఆ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(91 నాటౌట్; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇన్నింగ్స్ ఒకటైతే, బ్రార్ స్పిన్ బౌలింగ్ మ్యాచ్‌కే హైలైట్. అసలు బ్రార్ మూడు కీలక వికెట్లను తీస్తాడని ఎవరికీ నమ్మకం లేకపోయినా కెప్టెన్‌గా రాహుల్ మాత్రం అతనిపై నమ్మకంతోనే తుది జట్టులోకి తీసుకున్నామన్నాడు. తమ అంచనా నిజం కావడంతోనే ఆర్సీబీపై ఓ గొప్ప విజయాన్ని సాధించామన్నాడు.
మ్యాచ్ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ‘మేము ప్రాక్టీస్‌లో బ్రార్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేశాం. ఈ తరహా పిచ్‌ల్లో ఒక ఫింగర్ స్పిన్నర్ కావాలనే అతన్ని తీసుకున్నాం. ఇక్కడ ఫింగర్ స్పిన్నర్లు వేసే లెంగ్త్‌ను ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. మేము ఏదైతే అనుకున్నామో బ్రార్ అదే చేశాడు. అదే సమయంలో చివర్లో మా బ్యాటింగ్ బాగుంది. మా జట్టులో టాలెంట్ ఉంది. కానీ వారిని పరిస్థితుల్ని బట్టి ఆడే విధంగా సిద్దం చేయాలి. జట్టును ముందుండి నడిపించడం చాలా ముఖ్యం.
ప్రతీ గేమ్‌లో సాధ్యమైనంతవరకూ ఏమి చేయాలో అది చేస్తున్నా. మనం టార్గెట్‌లు నిర్దేశించినప్పుడు బౌలర్లపై ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. గేల్‌కు ఇంకా ఆడే సత్తా ఉంది. కెప్టెన్‌గా ఆ విషయం నాకు తెలుసు. నేను 7-8 ఏళ్ల నుంచి గేల్‌తో ఆడుతున్నా., రోజు రోజుకీ మెరుగుపడుతూనే ఉన్నాడు. గేల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం తన కెరీర్‌లోనే చేసి ఉండకపోవచ్చు. కానీ జట్టు కోసం ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు. టాపార్డర్‌లో నాకు ఒత్తిడి తగ్గిస్తున్నాడు గేల్. జట్టు కోసం ఏదైనా చేస్తాడు గేల్’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment