ఎన్నిరోజులైందో ఇలా కలిసి మాట్లాడుకొని.. | IPL 2021: Yuzvendra Chahal Shares Pic With MS Dhoni Says Great Reunite | Sakshi
Sakshi News home page

ఎన్నిరోజులైందో ఇలా కలిసి మాట్లాడుకొని..

Published Mon, Apr 26 2021 7:38 PM | Last Updated on Mon, Apr 26 2021 8:43 PM

IPL 2021: Yuzvendra Chahal Shares Pic With MS Dhoni Says Great Reunite - Sakshi

Courtesy : IPL Twitter

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన సీఎస్‌కే ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మునపటి ఆటతీరును గుర్తుకుతెస్తుంది. ఇక ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ, సీఎస్‌కే ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకొని చాట్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ధోని, కోహ్లి కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో ఇద్దరు కలిసి టీమిండియాకు ఆడిన రోజులు గర్తుచేశాయి. 

ఈ సందర్భంగా ఆర్‌సీబీ స్పిన్నర్‌ యజ్వంద్ర చహల్‌ తన గురువు ధోనితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. నా జీవితంలో మళ్లీ ఒక అద్బుతమైన రోజు తిరిగివచ్చింది.అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత బౌండరీ రోప్‌ వద్ద ఈ ఇద్దరు కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా చహల్‌ ధోని నుంచి విలువైన సూచనలు పొందాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ షో కనబరచడంతో సీఎస్‌కు 69 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పడిక్కల్‌(34) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్‌ 22 పరుగులు చేయగా.. మిగతావారు సీఎస్‌కే బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లారు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా 3, తాహిర్‌ 2, శార్ధూల్‌, సామ్‌ కరన్‌ చెరో వికెట్‌ తీశారు.తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆడిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో జడేజా 62 నాటౌట్‌ మెరుపులు మెరిపించగా.. డుప్లెసిస్‌ 50 పరుగులతో రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, చహల్‌ ఒక వికెట్‌ తీశారు.
చదవండి: ఒక్క ఓవర్‌.. 37 పరుగులు.. జడ్డూ విధ్వంసం

Imran Tahir: వయస్సు ఎక్కువ.. అందుకే సీక్రెట్‌గా ప్రాక్టీస్‌ చేస్తా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement