షూటింగ్‌లో దుమ్మురేపిన చహల్‌.. 'ఐపీఎల్‌ వదిలేశావా' | IPL 2021: Yuzvendra Chahal Shooting Range Success Became Viral | Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: షూటింగ్‌లో దుమ్మురేపిన చహల్‌.. 'ఐపీఎల్‌ వదిలేశావా'

Published Fri, Oct 1 2021 8:00 PM | Last Updated on Fri, Oct 1 2021 8:02 PM

IPL 2021: Yuzvendra Chahal Shooting Range Success Became Viral  - Sakshi

Yuzvendra Chahal Shooting.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ షూటింగ్‌లో దుమ్మురేపాడు. ఆర్‌సీబీకి మ్యాచ్‌ గ్యాప్‌ రావడంతో చహల్‌ సరదాగా షూటింగ్‌ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ షూటింగ్‌ చేసిన చహల్‌ 10 పాయింట్లు సాధించాడు. తన షూటింగ్‌ వీడియోనూ చహల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ మై టార్గెట్‌ ఈజ్‌ సెట్‌ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ప్రస్తుతం చహల్‌ షేర్‌ చేసిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఒక అభిమాని చహల్‌పై ఒక ఫన్నీ కామెంట్‌ చేశాడు. '' షూటింగ్‌లో దుమ్ములేపావు.. ఐపీఎల్‌ వదిలేశావా ఏంటి..'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే


Courtesy: IPL Twitter

ఇక కొద్దిరోజులుగా ఫామ్‌లేమితో​ ఇబ్బంది పడుతున్న చహల్‌ ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సెకండ్‌ఫేజ్‌ మొదలైన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 2/18తో మంచి ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో ఆర్‌సీబీ మంచి ప్రదర్శననే కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు చేరాలని భావిస్తోంది. కాగా రాజస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్‌సీబీ అక్టోబర్‌ 3న పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది.

చదవండి: Viral Video: సచిన్‌ను చూసాక ఇషాన్‌ కిషన్‌ రియాక్షన్‌.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement