IPL 2022: Chennai Super Kings Take on Lucknow Super Giants - Sakshi
Sakshi News home page

CSK VS LSG: బోణీ విజయం కోసం తహతహలాడుతున్న జడేజా, కేఎల్‌ రాహుల్‌.. చెరో మార్పుతో..!

Published Thu, Mar 31 2022 12:17 PM | Last Updated on Thu, Mar 31 2022 3:35 PM

IPL 2022: Chennai Super Kings Take On Lucknow Super Giants - Sakshi

Pic Credit: Deccan Herald

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రవీంద్ర జడేజా, లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారధి కేఎల్‌ రాహుల్‌ బోణీ విజయం కోసం తహతహలాడుతున్నారు. ఇద్దరి జట్లు తమ లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 31) ఆస‌క్తిర పోరుకు తెరలేవనుంది. గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. 

సీఎస్‌కే విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌ ఆడిన న్యూజిలాండ్ ఆట‌గాడు డెవాన్‌ కాన్వే స్థానంలో స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ బ‌రిలోకి దిగే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌తో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఊత‌ప్ప, మొయిన్ అలీ, అంబ‌టి రాయుడు, రవీంద్ర జ‌డేజా, శివ‌మ్ దూబే, మ‌హేంద్ర సింగ్ ధోని, మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, ఆడ‌మ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండేలు తుది జట్టులో ఉంటారని అంచనా. 

ఇక లక్నో సూప‌ర్ జెయింట్స్ జట్టు కూడా ఏకైక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని మోహ్సిన్‌ ఖాన్‌ స్థానంలో స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ లేదా షాబజ్‌ నదీమ్‌లలో ఒకరికి అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. కేఎల్ రాహుల్, క్వింట‌న్ డికాక్, ఎవిన్ లూయిస్, మ‌నీష్‌ పాండే, దీప‌క్ హుడా, అయూష్ బ‌దోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్‌/షాబజ్‌ నదీమ్‌, దుష్మంత చ‌మీర‌, ఆవేష్ ఖాన్‌, ర‌వి బిష్ణోయ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. 

ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో పైచేయి సాధించే అవకాశం ఉంది. ఇరు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్లు సాధించలేక ఓటమిపాలయ్యారు. అయితే, చెన్నైతో పోలిస్తే.. లక్నో కాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేసిందనే చెప్పాలి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ధోని (50 నాటౌట్‌) మినహా ఏ ఒక్క సీఎస్‌కే బ్యాటర్‌ రాణించలేకపోగా.. గుజరాత్‌తో మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు దీపక్‌ హుడా (55), అయూష్‌ బదోని (54) పర్వాలేదనిపించారు. ఇక బౌలింగ్‌లో సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ బౌలర్లు స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమై మ్యాచ్‌లను చేజార్చుకున్నారు. 
చదవండి: IPL 2022: షమీ ప్రదర్శనపై మనసుపారేసుకున్న అమెరికా శృంగార తార..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement