వార్నర్, కుల్దీప్, పృథ్వీ షా
IPL 2022 KKR Vs DC- ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కుదేలైంది. బ్యాటింగ్‌లో గర్జించింది. బౌలింగ్‌తో పడేసింది. మ్యాచ్ ఆసాంతం ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. దీంతో ఆదివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగులతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జయభేరి మోగించింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు చేసింది. పృథ్వీ షా (29 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వార్నర్ (45 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరే గారు.
చివర్లో శార్దుల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) దంచారు. తర్వాత నైట్‌రైడర్స్ 19.4 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.
షా మెరుపు ఫిఫ్టీ...
లక్నోతో గత మ్యాచ్ ‘షో’ను పృథ్వీ షా పునరావృతం చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే దాడి మొదలుపెట్టాడు. తొలి ఓవర్లో రెండు ఫోర్లు, రెండో ఓవర్లో ఒక బౌండరీ, మూడో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు, నాలుగో ఓవర్లో సిక్స్! ఇలా పృథ్వీ చెలరేగడంతో ఢిల్లీ జట్టు స్కోరు నాలుగో ఓవర్లోనే 50 దాటేసింది. షా 27 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకొని ఔటయ్యాడు. అలా 9వ ఓవర్లో 93 పరుగుల ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి వెళ్లిపోగా, కుదురుగా ఆడిన వార్నర్ అర్ధశతకం చేశాక అవుటయ్యాడు.
3 ఓవర్లు 48 పరుగులు...
17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 167/5. ఓపెనర్ వార్నర్ ఆ ఓవర్లోనే ఔటయ్యాడు. క్రీజులో అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. వీళ్లిద్దరూ ఆల్‌రౌండర్లే... కానీ బౌలింగ్ ఆల్‌రౌండర్లు. ఒకట్రెండు మెరుపులు, మూణ్నాలుగు బౌండరీలు ఆశించవచ్చు. ఇలాంటి ఇద్దరితో ఢిల్లీ ఊహకందని స్కోరు చేసింది. కమిన్స్ 18వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. తర్వాత ఉమేశ్ ఓవర్లో శార్దుల్, అక్షర్ 6, 0, 6, 1, 6, 4లతో 23 పరుగులు సాధించారు. కమిన్స్ ఆఖరి ఓవర్లో 16 పరుగులొచ్చాయి. దీంతో ఇద్దరు ప్రధాన బౌలర్లు ఉమేశ్ (1/48), కమిన్స్ (0/51) 99 పరుగులు ఇవ్వడం గమనార్హం.
కెప్టెన్ ఒక్కడే...
బౌలింగ్‌లో ఢిల్లీ ధాటికి డీలా పడిన కోల్‌కతా బ్యాటింగ్‌లోనూ చేతులెత్తేసింది. ఓపెనర్లు రహానే (8), వెంకటేశ్ అయ్యర్ (18) నిరాశపరిచారు. నితీశ్ రాణా (20 బంతుల్లో 30; 3 సిక్స్‌లు) కాసేపు మెరిశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. 32 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. కొండంత ఛేదనలో రసెల్ (21 బంతుల్లో 24; 3 ఫోర్లు) విఫలమయ్యాడు. దీంతో అయ్యర్ జతచేసిన స్కోరు సరిపోలేదు. ఖలీల్ అహ్మద్ కీలక వికెట్లు పడగొట్టడం, కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో కోల్‌కతాకు ఓటమి ఖరారైంది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) వరుణ్ 51; వార్నర్ (సి) రహానే (బి) ఉమేశ్ 61; పంత్ (సి) ఉమేశ్ (బి) రసెల్ 27; లలిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 1; పావెల్ (సి) సబ్– ఆర్కే సింగ్ (బి) నరైన్ 8; అక్షర్ (నాటౌట్) 22; శార్దుల్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 215.
వికెట్ల పతనం: 1–93, 2–148, 3– 151, 4–161, 5–166.
బౌలింగ్: ఉమేశ్ 4–0– 48–1, రసిఖ్ 1–0–10–0, కమిన్స్ 4–0–51–0, వరుణ్ 4–0–44–1, నరైన్ 4–0–21–2, రసెల్ 2–0–16–1, వెంకటేశ్ 1–0–14–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) శార్దుల్ (బి) ఖలీల్ 8; వెంకటేశ్ (సి) అక్షర్ (బి) ఖలీల్ 18; శ్రేయస్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 54; రాణా (సి) పృథ్వీ (బి) లలిత్ 30; రసెల్ (సి) సర్ఫరాజ్ (బి) శార్దుల్ 24; బిల్లింగ్స్ (సి) లలిత్ (బి) అహ్మద్ 15; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 4; నరైన్ (సి) పావెల్ (బి) కుల్దీప్ 4; ఉమేశ్ (సి అండ్ బి) కుల్దీప్ 0; రసిఖ్ (సి)పావెల్ (బి) శార్దుల్ 7; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 171.
వికెట్ల పతనం: 1–21, 2–38, 3–107, 4–117, 5–133, 6–139, 7–143, 8–143, 9–170, 10–171.
బౌలింగ్: ముస్తఫిజుర్ 4–0–21–0, శార్దుల్ 2.4–0–30–2, ఖలీల్ 4–0–25–3, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0– 35–4, పావెల్ 1–0–17–0, లలిత్ 1–0–8–1.
ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ X గుజరాత్ టైటాన్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
A superb win for @DelhiCapitals! 👏 👏
— IndianPremierLeague (@IPL) April 10, 2022
The @RishabhPant17-led unit bounce back in style and they beat #KKR by 4️⃣4️⃣ runs. 👍 👍
Scorecard ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/iRM9fVPXna
Comments
Please login to add a commentAdd a comment