ముంబై: ఐపీఎల్ గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి గుజరాత్ టైటాన్స్ వెంటనే కోలుకుంది. పూర్తి సత్తాను ప్రదర్శిస్తూ టాప్‌లో ఉన్న రాజస్తాన్‌ను ఓడించి నాలుగో విజయంతో అగ్ర స్థానానికి చేరింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37 పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి దాకా నిలబడి పరుగులు సాధించగా, అభినవ్ మనోహర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడింది. జోస్ బట్లర్ (24 బంతుల్లో 54; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఫెర్గూసన్ (3/23) కీలక వికెట్లు తీశాడు.
పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్
ఆట మొదలైన ఓవర్లోనే వేడ్ (12) మూడు ఫోర్లు కొట్టి తర్వాతి ఓవర్లోనే రనౌటయ్యాడు. విజయ్ శంకర్ (2), శుబ్‌మన్ గిల్ (13) నిరాశపరిచారు. ఆరంభంలో కష్టాలు పడిన గుజరాత్‌ను నాయకుడు హార్దిక్ పాండ్యా నడిపించాడు. అభినవ్ మనోహర్‌తో కలిసి అడపాదడపా బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ను పెంచాడు. ఇద్దరూ స్కోరు పెంచే ప్రయత్నంలో స్పిన్నర్లు అశ్విన్, చహల్‌లను వాడేసుకున్నారు. సునాయాసంగా సిక్సర్లు బాదేశారు. అయితే చహల్ బౌలింగ్‌లోనే మరో భారీ షాట్ ఆడిన అభినవ్... అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన మిల్లర్ (14 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కుల్దీప్‌సేన్ వేసిన 19వ ఓవర్‌ను చితగ్గొట్టేశాడు. తొలి బంతికి హార్దిక్ పరుగు తీయగా... మిల్లర్ 4, 6, 2, 4, 4 బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 21 పరుగులొచ్చాయి. వీళ్లిద్దరు 25 బంతుల్లోనే అభేద్యంగా 53 పరుగులు జోడించారు.
బట్లర్ ఆడినంత వరకే...
రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో తొలి 11 బంతుల్ని ఆడిన బట్లర్ 28 పరుగులు చేశాడు. షమీ మొదటి ఓవర్లో 3 ఫోర్లు, యశ్ దయాళ్ రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో చకచకా పరుగులు సాధించాడు. అయితే 12వ బంతికి దేవ్‌దత్ పడిక్కల్ (0)ను దయాళ్ అవుట్ చేశాడు. ఆశ్చర్యకరంగా అశ్విన్ వన్‌డౌన్‌లో రాగా... దయాళ్ ఓవర్లో బట్లర్ వరుసగా 4, 0, 4, 6, 0, 4లతో 18 పరుగులు పిండుకున్నాడు. అశ్విన్ (8) సిక్సర్‌తో 4.2 ఓవర్లోనే జట్టు 50 పరుగులు చేసింది. ఫెర్గూసన్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 6వ)తోనే రాజస్తాన్ రాయల్స్‌కు ఓటమిదారి చూపాడు. మొదటి బంతికి అశ్విన్‌ను పెవిలియన్ చేర్చగా... బట్లర్ సిక్సర్‌తో 23 బంతుల్లో అర ్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆఖరి బంతిని యార్కర్‌గా వేసి బట్లర్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఇంకెవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరచలేకపోయారు. సంజూ సామ్సన్ (11), వాన్ డెర్ డసెన్ (6)విఫలం కాగా, హెట్‌మైర్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వేడ్ రనౌట్ 12; గిల్ (సి) హెట్‌మైర్ (బి) పరాగ్ 13; శంకర్ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ సేన్ 2; హార్దిక్ నాటౌట్ 87; అభినవ్ (సి) అశ్విన్ (బి) చహల్ 43; మిల్లర్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–12, 2–15, 3–53, 4–139. బౌలింగ్: నీషమ్ 3–0–29–0, ప్రసిధ్‌కృష్ణ 4–0–35–0, కుల్దీప్‌సేన్ 4–0–51–1, చహల్ 4–0–32–1, పరాగ్ 1–0–12–1, అశ్విన్ 4–0–33–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) ఫెర్గూసన్ 54; పడిక్కల్ (సి) గిల్ (బి) యశ్ దయాళ్ 0; అశ్విన్ (సి) మిల్లర్ (బి) ఫెర్గూసన్ 8; సామ్సన్ రనౌట్ 11; వాన్ డెర్ డసెన్ (సి) వేడ్ (బి) యశ్ దయాళ్ 6; హెట్‌మైర్ (సి) తెవాటియా (బి) షమీ 29; పరాగ్ (సి) గిల్ (బి) ఫెర్గూసన్ 18; నీషమ్ (సి) అండ్ (బి) పాండ్యా 17; ప్రసిధ్‌కృష్ణ నాటౌట్ 4; చహల్ (సి) శంకర్ (బి) యశ్ దయాళ్ 5; కుల్దీప్ సేన్ నాటౌట్ 0;ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1–28, 2–56, 3–65, 4–74. 5–90, 6–116, 7–138, 8–147, 9–155.
బౌలింగ్: షమీ 4–0–39–1, యశ్ దయాళ్ 4–0–40–3, రషీద్‌ఖాన్ 4–0–24–0, ఫెర్గూసన్ 4–0–23–3, తెవాటియా 1–0–9–0, పాండ్యా 2.3–0–18–1, విజయ్ శంకర్ 0.3–0–1–0.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X కోల్‌కతా
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
IPL 2022 RR Vs GT: హార్దిక్ పాండ్యా మెరుపులు.. రాజస్తాన్‌పై గుజరాత్ ఘన విజయం
Published Fri, Apr 15 2022 5:22 AM | Last Updated on Fri, Apr 15 2022 10:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment