Breadcrumb
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి.. గుజరాత్ టైటాన్స్‌కు రెండో విజయం
Published Sat, Apr 2 2022 7:06 PM | Last Updated on Sat, Apr 2 2022 11:37 PM
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లైవ్ అప్డేట్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి.. గుజరాత్ టైటాన్స్‌కు రెండో విజయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. పంత్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోవ్‌మెన్ పావెల్ 20 , లిలిత్ యాదవ్ 26 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 4, షమీ 2, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.
ఓటమి దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కుల్దీప్ 4, ముస్తాఫిజుర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
ఆరో వికెట్ డౌన్.. కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజగా 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 15 ఓవర్లలో 6 వికెట్ల నష్ఠానికి 126 పరుగులు చేసింది. పావెల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు
లలిత్ యాదవ్(25) రనౌట్.. నాలుగో వికెట్ డౌన్
లలిత్ యాదవ్(25) రనౌట్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంత్‌తో సమన్వయ లోపంతో లలిత్ యాదవ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. పంత్ 41, రోవ్‌మెన్ పావెల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 12, లలిత్ యాదవ్ 8 పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 32/1
4 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. పృథ్వీ షా 10, మన్దీప్ సింగ్ 18 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే గట్టిషాక్ తగిలింది. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్(3) అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. పృథ్వీ షా 6, మన్దీప్ సింగ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా 31, డేవిడ్ మిల్లర్ 20 పరుగులు నాటౌట్ రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3, ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
గిల్(84) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
84 పరుగుల సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిసిన శుబ్‌మన్ గిల్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 11 పరుగులతో ఆడుతున్నాడు.
హార్దిక్ పాండ్యా(31) ఔట్.. మూడో వికెట్ డౌన్
31 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. గిల్ 67, డేవిడ్ మిల్లర్ 4 పరుగులతో ఆడుతున్నారు.
నిలకడగా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్.. 12 ఓవర్లలో 89/2
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 28, గిల్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.
విజయ్ శంకర్(13) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
విజయ్ శంకర్(13) రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 48 పరుగులతో ఆడుతుంది. గిల్ 26, హార్దిక్ పాండ్యా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు చేసిన మాథ్యూ వేడ్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. విజయ్ శంకర్ 7, గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబైతో ఆడిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించగా.. ఇటు సీజన్లో తొలిసారి పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌పై సూపర్ విక్టరీతో బోణీ కొట్టింది. మరి ఢిల్లీ క్యాపిటల్స్‌పై హార్దిక్ సేన అదే జోరు చూపిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Related News By Category
Related News By Tags
-
IPL 2023: గుజరాత్‌ను గెలిపించిన సాయి సుదర్శన్
గుజరాత్‌ను గెలిపించిన సాయి సుదర్శన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ 48 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్ ఆఖరి వరకు నిలిచి ...
-
'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ‘ఫోర్డీ ప్లేయర్’గా అభివర్ణించాడు. ''హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫోర్ డైమెన్షనల్ ప్లేయర...
-
గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే
క్రికెట్లో ఒక జట్టు మేజర్ కప్ గెలిచిదంటే ముందుగా పేరొచ్చేది జట్టు కెప్టెన్‌కే. ఎందుకంటే కెప్టెన్ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి. ఒక కెప్టెన్‌గా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జట్టును ముందుండి నడిప...
-
'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'
ఐపీఎల్ 2022 సీజన్ చాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన గుజరాత్.. అరంగేట్రం సీజన్లోనే టైటిల్‌ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. ...
-
ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక
ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఫైనల్ పోరుకు తెర లేచింది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ విషయం పక్కనబెడితే టాస్కు ముందు ఒక ...
Comments
Please login to add a commentAdd a comment