Breadcrumb
- HOME
Live Updates: బోణీ కొట్టిన గుజరాత్.. లక్నోపై ఘన విజయం
Published Mon, Mar 28 2022 6:46 PM | Last Updated on Mon, Mar 28 2022 11:30 PM
Live Updates
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
బోణీ కొట్టిన గుజరాత్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటరల్లో రాహుల్ తెవాటియా(40), హార్ధిక్ పాండ్యా(33), మిల్లర్(30) పరుగులతో రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలరల్లో చమీరా రెండు వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్యా, హుడా, ఆవేష్ఖాన్ చెరో వికెట్ సాధించారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన
లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కాగా లక్నో స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రాహుల్, డికాక్, మనీష్ పాండే దారుణంగా విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు.
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మిల్లర్.. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గుజరాత్ విజయానికి 15 బంతుల్లో 21 పరుగులు కావాలి.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
79 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన వేడ్.. హుడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి గుజరాత్ 88 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. హార్ధిక్ పాండ్యా ఔట్
73 పరుగుల వద్ద గుజరాత్ హార్ధిక్ పాండ్యా రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో హార్ధిక్.. మనీష్ పాండే క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 55/2
8 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ 55 పరుగులు చేసింది. క్రీజులో హార్థిక్ పాండ్యా(27), వేడ్(17) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
15 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన విజయ్ శంకర్, చమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. గిల్ డకౌట్
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన చమీరా బౌలింగ్‌లో గిల్ డకౌటయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 159 పరుగులు
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా(55), బదోని(54) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కాగా లక్నో స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రాహుల్, డికాక్, మనీష్ పాండే దారుణంగా విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు.
ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
116 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ దీపక్ హుడా రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన హుడా.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
దీపక్ హుడా అర్ధ సెంచరీ.. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 109/4
పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నో సూపర్ జెయింట్స్‌ను దీపక్ హుడా అదుకున్నాడు. 37 బంతుల్లో హుడా అర్ధ సెంచరీ సాదించాడు. 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో.. నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. క్రీజులో హుడా(55), బదోనీ(28) పరుగులతో ఉన్నారు.
11 ఓవర్లకు లక్నో స్కోర్: 58/4
11 ఓవర్లు ముగిసేసరికి లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. క్రీజులో హుడా(25), బదోనీ(7) పరుగులతో ఉన్నారు.
వరుసగా రెండు వికెట్లు
వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ మరింత కష్టాల్లో పడింది. ఆరోన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి లూయిస్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
షమీ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి మనీష్ పాండే పెలివియన్ చేరాడు. షమీ అద్భుత బంతితో పాండే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన లక్నో
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో రాహుల్‌ను ఔట్ చేసిన షమీ.. మూడో ఓవర్లో డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి లక్నో 14 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్‌కు అదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్లో కొత్త జట్లుగా అవతరించిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తొలి పోరుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయిట్స్కు కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ ఉండగా, గుజరాత్ టైటాన్స్‌కు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు.
తుది జట్లు
గుజరాత్: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
లక్నో: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
Related News By Category
Related News By Tags
-
లక్నోతో మ్యాచ్.. గుజరాత్‌కు వార్నింగ్ ఇచ్చిన పీటర్సన్
ఐపీఎల్-2022లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కాగా వరుసగా రెం...
-
IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..!
Playoff Matches Likely To Be Played In Lucknow And Ahmedabad: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే ప్లే ఆఫ్స్ ముచ్చటేందీ అనుకుంటున్నారా..? అయితే, ఈ వార్త పూర్తిగా చదవం...
-
అతడొక అద్భుతం.. మాకు బేబీ డివిలియర్స్ లాంటి వాడు: రాహుల్
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఆయుష్ బదోనిపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో లక్...
-
GT VS LSG: కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలను ఊరిస్తున్న రికార్డులు ఇవే..!
GT VS LSG: ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇవాళ (మార్చి 29) జరగనున్న ఆసక్తికర మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటంట...
-
IPL 2022: క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఆసక్తికర పోరు.. గెలుపుతో బోణీ కొట్టాలని..!
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇవాళ (మార్చి 28) వాంఖడే వేదికగా తలపడనున్నాయి. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హార్ధిక్ పాం...
Comments
Please login to add a commentAdd a comment