
Courtesy: IPL Twitter
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏన�...
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మ�...
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ క...
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల�...
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ �...
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజ...
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రత�...
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ...
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యా�...
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల...
న్యూయార్క్: ఇటీవలి కాలంలో బాంబు బెద�...
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనం�...
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
Published Sun, Apr 10 2022 2:50 PM | Last Updated on Sun, Apr 10 2022 7:43 PM
Courtesy: IPL Twitter
IPL 2022: కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 171 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54), నితీష్ రాణా(30) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్ధీప్ యాదవ్ నాలుగు వికెట్లు, ఖాలీల్ ఆహ్మద్ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు, లలిత్ యాదవ్ ఒక వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్(61), పృథ్వీ షా(51) అర్ధ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.
కేకేఆర్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో బిల్లింగ్ ఔట్ కాగా.. తరువాతి ఓవర్ వేసిన కుల్ధీప్ యాదవ్ బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ పెవిలియన్‌కు చేరాడు.కేకేఆర్ విజయానికి 26 బంతుల్లో 77 పరుగులు కావాలి
కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టాంపౌట్ అయ్యాడు.
107 పరుగులు వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. లలిత్ యాదవ్ బౌలింగ్‌లో నితీష్ రాణా(30) ఔటయ్యాడు.
38 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రహానే.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ వికెట్‌ను కోల్పోయింది. 15 పరుగులు చేసిన అయ్యర్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లకు స్కోర్: 38/1
కేకేఆర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(61),పృథ్వీ షా( 51) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.
166 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్ ఎల్బీగా వెనుదిరిగాడు. 15 ఓవర్లకు స్కోర్: 161/3
148 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన పంత్.. రస్సెల్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 148/2
93 పరుగులు వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 51 పరుగులు పృధ్వీ షా.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో పృథ్వీ షా(24), వార్నర్(6) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటిల్స్ మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
కోల్‌కతా నైట్‌రైడర్స్
అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment