IPL 2022: LSG Giants Record 4th Highest Successful Run Chase In IPL History - Sakshi
Sakshi News home page

IPL 2022 CSK VS LSG: సీఎస్‌కేపై ఘన విజయం.. లక్నో ఖాతాలో అరుదైన రికార్డు!

Published Fri, Apr 1 2022 9:25 AM | Last Updated on Fri, Apr 1 2022 10:58 AM

IPL 2022: LSG Record 4th Highest Successful Run Chase in History - Sakshi

లక్నో జట్టు సంబరాలు(PC: IPL/ BCCI)

Highest  Targets Successfully Chased Down in IPL Hsitory: ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్‌ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా రెండో మ్యాచ్‌లో సీఎస్‌కే వంటి మేటి జట్టుపై ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం సాధించి సత్తా చాటింది. చెన్నై విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రత్యర్థికి గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ సేన అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో భారీ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన నాలుగో జట్టుగా లక్నో నిలిచింది.

కాగా బ్రబోర్న్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న లక్నో.. చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చెన్నై 210 పరుగులు చేసింది.

ఇక ఇందుకు బదులుగా సీఎస్‌కే బౌలర్‌ ముఖేశ్‌ చౌదరి వేసిన ఆఖరి ఓవర్‌ మూడో బంతికి లక్నో యువ సంచలనం ఆయుష్‌ బదోని సింగిల్‌ తీసి తమ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో రెండో మ్యాచ్‌తోనే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో లక్నోకు గుర్తుండిపోయే విజయం దక్కింది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్ల జాబితాలో చోటు సంపాదించుకుంది.

సీజన్‌ వేదిక   టార్గెట్‌ విజయం సాధించిన జట్టు ప్రత్యర్థి
2020 షార్జా

224

రాజస్తాన్‌ రాయల్స్‌ పంజాబ్‌ కింగ్స్‌
2021 ఢిల్లీ 219 ముంబై ఇండియన్స్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌
2008 హైదరాబాద్‌ 215 రాజస్తాన్‌ రాయల్స్‌ దక్కన్‌ చార్జర్స్‌
2022 ముంబై 211 లక్నో సూపర్‌జెయింట్స్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌
2017 ఢిల్లీ 209 ఢిల్లీ క్యాపిటల్స్‌ గుజరాత్‌ లయన్స్‌

చదవండి: CSK Vs LSG: బదోని భారీ షాట్‌... అమ్మ బాబోయ్‌.. ఆమె తలపగిలేదేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement