IPL Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధావన్‌, వార్నర్‌ భాయ్‌.. ఇంకా | IPL 2022 Mega Auction: Marquee Players List 10 Players Dhawan Ashwin Includes | Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధావన్‌, అశూ, వార్నర్‌ భాయ్‌.. ఇంకా..

Published Tue, Feb 1 2022 4:05 PM | Last Updated on Tue, Feb 1 2022 4:16 PM

IPL 2022 Mega Auction: Marquee Players List 10 Players Dhawan Ashwin Includes - Sakshi

IPL 2022 Mega Auction- Marquee Players List: మెగా వేలం-2022 నిర్వహణతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ సంబరం మొదలుకానుంది. ఈనెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగనున్న ఆక్షన్‌కు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌, లక్నో, ముంబై, పంజాబ్‌, రాజస్తాన్‌, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వేలంలో పేర్లు నమోదు చేసుకున్న 1214 మంది క్రికెటర్లలో 590 మందిని షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.

ఈ క్రమంలో  ‘మార్కీ ప్లేయర్స్‌’(కీలక ఆటగాళ్లు) లిస్టును కూడా ఐపీఎల్‌ ప్రకటించింది. ‘‘బిగ్‌ నేమ్స్‌ ఎట్‌ మెగా ఆక్షన్‌’’ పేరిట వేలంలో పాల్గొనబోయే స్టార్‌ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఇందులో టీమిండియా సీనియర్‌ ఆటగాడు, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందు వరుసలో నిలిచాడు. అతడితో పాటు మహ్మద్‌ షమీ(ఇండియా), ఫాఫ్‌ డుప్లెసిస్‌(దక్షిణాఫ్రికా), డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా), ప్యాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా), శ్రేయస్‌ అయ్యర్‌(ఇండియా), రవిచంద్రన్‌ అశ్విన్‌(ఇండియా), క్వింటన్‌ డికాక్‌(దక్షిణాఫ్రికా), కగిసో రబడ(దక్షిణాఫ్రికా), ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌)లకు మార్కీ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కింది. 

చదవండి: IPL 2022: ఆ డబ్బుతో మొదట ఐఫోన్‌, సెకండ్‌ హాండ్‌ కారు కొన్నా.. అందులో ఏసీ లేదు: సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement