MI VS DC Head To Head: ఐపీఎల్ 2022 సీజన్ తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కాగా, బోణీ విజయం కోసం ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. రికార్డుల పరంగా చూస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు మొత్తం 30 మ్యాచ్‌ల్లో తలపడగా, ముంబై 16, ఢిల్లీ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
గత 5 మ్యాచ్‌ల్లో రికార్డులను పరిశీలిస్తే.. 2020 ఐపీఎల్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల్లో (ఫైనల్ మ్యాచ్‌తో కలిపి) ముంబైనే విజయం వరించగా, గతేడాది 2 మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ సేన.. ముంబై ఇండియన్స్‌పై పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో గతేడాది ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ జట్టు భావిస్తుంది.
బలాబలాల విషయానికొస్తే.. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ముంబై ఇండియన్స్ ఈసారి బలహీనంగా కనిపిస్తుంది. ఆటగాళ్ల రిటెన్షన్‌లో ప్రధాన ఆటగాళ్లను నిలుపుగోగలిగిన ముంబై టీమ్.. మెగా వేలంలో ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్ (జూనియర్ ఏబీడీ), టిమ్ డేవిడ్ లాంటి యువ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగిన ఆటగాళ్లు లేరు. ఇక బౌలింగ్‌లో పేసు గుర్రం బుమ్రా అన్నీ తానై వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఆల్‌రౌండర్ కోటాలో కీరన్ పోలార్డ్ ఉన్నా మునపటిలా అతను రాణించలేకపోతున్నాడు. పైపెచ్చు ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా సూర్యకుమార్ దూరం కానున్నాడు.
మరోవైపు ఢిల్లీ జట్టును చూస్తే రిషబ్ పంత్ నేతృత్వంలో ఆ జట్టు యువ ఆటగాళ్లతో ఉరకలేస్తుంది. బ్యాటింగ్‌లో పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్ లాంటి యువ ఆటగాళ్లు.. ఆల్‌రౌండర్ల కోటాలో శార్ధూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌లతో డీసీ బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. యువ బౌలర్లు చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్‌లతో కాస్త బలహీనంగా కనిపించినా ముస్తాఫిజుర్ రెహమాన్, లుంగీ ఎంగిడి, నోర్జే చేరికతో బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, మిచెల్ మార్ష్ త్వరలో జట్టుతో చేరితే డీసీ మరింత బలంగా మారనుంది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, బాసిల్ థంపి, ఎం అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, టిమ్ డేవిడ్, రిలే మెరెడిత్, మహ్మద్ అర్షద్ ఖాన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ఫాబియన్ అలెన్, ఆర్యన్ జుయల్.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), అక్షర్ పటేల్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, కమలేష్ నాగర్‌కోటి, మన్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, టిమ్ సీఫెర్ట్, విక్కీ ఓస్ట్వాల్, వార్నర్, మిచెల్ మార్ష్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్, నోర్జే
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment