IPL 2022: Virat Kohli Shares Important Video About RCB New Captain - Sakshi
Sakshi News home page

IPL 2022- RCB New Captain: అప్‌డేట్‌ ఇచ్చిన కోహ్లి.. వావ్‌ మళ్లీ భయ్యానే కెప్టెన్‌!

Published Thu, Mar 10 2022 4:57 PM | Last Updated on Thu, Mar 10 2022 7:44 PM

IPL 2022: Renewed Energy Virat Kohli Update On Captain Fans Cant Keep Calm - Sakshi

అప్‌డేట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లి(PC: RCB)

IPL 2022- RCB New Captain: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2022 సీజన్‌ త్వరలోనే మొదలుకానుంది. మార్చి 26న డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా సీజన్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్‌ అగర్వాల్‌ తమ కొత్త కెప్టెన్‌ అని ఇప్పటికే ప్రకటన చేయగా.. కోల్‌కతా సైతం శ్రేయస్‌ అయ్యర్‌ను తమ సారథిగా ఎంచుకున్నట్లు తెలిపింది.

అయితే, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాత్రం ఇంత వరకు తమ కొత్త కెప్టెన్‌ ఎవరన్నది రివీల్‌ చేయలేదు. కాగా గత సీజన్‌తో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్‌ కార్తిక్‌, లేదంటే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో మార్చి 12న ఓ ప్రకటన చేయబోతున్నామంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది.

ఇందులో భాగంగా గురువారం విరాట్‌ కోహ్లి మాట్లాడిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘‘పునురుత్తేజం. ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీకో ముఖ్య విషయం చెప్పాలి’’ అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కామెంట్స్‌ చేశాడు. ‘‘తేది: 12.03.2022, సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయంలో అప్‌డేట్‌ ఇస్తాం’’ అని ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడిన కొన్ని మాటలను ఆర్సీబీ మ్యూట్‌ చేసింది.

ఇందుకు స్పందించిన ఆర్సీబీ అభిమానులు.. ‘‘విరాట్‌ ప్లీజ్‌ నో చెప్పకు. నువ్వే కెప్టెన్‌గా ఉండాలి భయ్యా. ఉంటావు కదా! ఈ విషయం వినడానికి ఇంకా రెండు రోజులు ఎదురుచూడాలా? మా వల్ల కాదు! ప్లీజ్‌ తొందరగా చెప్పేసెయ్‌’’అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది.. ‘‘కోహ్లినే మళ్లీ కెప్టెన్‌గా వస్తాడు. చూడండి’’ అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్‌ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement