
Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరుదైన సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఏ ఇతర ఢిల్లీ ఆటగాడు కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన పంత్.. డీసీ తరఫున 86 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 2542 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. గత రెండు సీజన్లుగా డీసీని విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న పంత్.. ఆ జట్టును 2020లో ఫైనల్స్‌కు, 2021లో ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
ఇదిలా ఉంటే, శనివారం (ఏప్రిల్ 2) రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ 84 పరుగులతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా, ఛేదనలో ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమై లీగ్‌లో తొలి పరాజయాన్ని మూటుగట్టుకుంది. డీసీ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లతో డీసీ పతనాన్ని శాశించగా.. షమీ 2, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి.. గుజరాత్ టైటాన్స్‌కు రెండో విజయం