Courtesy: IPL Twitter
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
Published Mon, Apr 4 2022 7:07 PM | Last Updated on Mon, Apr 4 2022 11:22 PM
Courtesy: IPL Twitter
IPL 2022: ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 44 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. పూరన్ 34, సుందర్ 18 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4, జాసన్ హోల్డర్ 3, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 21, సుందర్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాహుల్ త్రిపాఠి(44) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రవి బిష్ణోయికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 24, మార్క్రమ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కేన్ విలియమ్సన్(16), అభిషేక్ శర్మ(13) ఔటయ్యారు.
కేన్ విలియమ్సన్(16) రూపంలో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆండ్రూ టైకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 54 పరుగులు సాధించాడు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు విలువైన 87 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్, షెపర్డ్, వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు తీశారు.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. నటరాజన్ మొదట 68 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ నటరాజన్ బౌలింగ్‌లో ఎల్బీ చేశాడు. ఆ తర్వాత ఓవర్ నాలుగో బంతికి కృనాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
54 పరుగులు చేసిన దీపక్ హుడా షెపర్డ్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 60, ఆయుష్ బదోని 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆరంభంలోనే మూడు వికెట్లు కీలక వికెట్లు కోల్పోయిన లక్నో ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు నిలబెట్టారు. 14 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 47, దీపక్ హుడా 48 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. షెపర్డ్ బౌలింగ్‌లో 11 పరుగులు చేసిన మనీష్ పాండే భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 17, దీపక్ హుడా 2పరుగులతో ఆడుతున్నారు.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. సీఎస్కేతో మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఎవిన్ లూయిస్ ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. అంతకముందు డికాక్(1)ను సుందర్ పెవిలియన్ చేర్చాడు.
రెండో ఓవర్లోనే లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు డీ కాక్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. 2 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకొంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫేలవ ఆటతీరుతో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో మెరుస్తుందేమో చూడాలి.
మరోవైపు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన లక్నో సూపర్ జెయింట్స్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సంచలన విజయం సాధించింది. ఎవిన్ లూయిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో భారీ లక్ష్యాన్ని సులువుగా చేధించింది.
Comments
Please login to add a commentAdd a comment