ఉత్కంఠపోరు.. ఆఖరి బంతికి పంజాబ్ కింగ్స్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. సికందర్ రజా ఏడు బంతుల్లో 13 పరుగులు చేసి పంజాబ్‌ను గెలపించాడు. అంతకముందు ప్రబ్‌సిమ్రన్ సింగ్ 42, లివింగ్‌స్టోన్ 40, సామ్ కరన్ 29, జితేశ్ శర్మ 21 పరుగులతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా.. జడేజా రెండు, మతీష్ పతీరానా ఒక వికెట్ పడగొట్టాడు.
Raza and @PunjabKingsIPL stun #CSK with the highest-ever #TATAIPL chase at Chepauk by an away side 🤯#CSKvPBKS #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/FCZWvFFDFM
— JioCinema (@JioCinema) April 30, 2023
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
151 పరుగులు వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 31 పరుగులు కావాలి.
15 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 129/3
15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పంజాబ్ విజయానికి 30 బంతుల్లో 72 పరుగులు కావాలి.
మూడో వికెట్ డౌన్
పంజాబ్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన అథర్వ తైడే.. జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Photo Credit : IPL Website
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
ప్రభుసిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన శిఖర్ ధావన్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔయ్యాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 62/1
Photo Credit : IPL Website
3 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 36/0
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(23), ప్రభుసిమ్రాన్ సింగ్(11) పరుగులతో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 200 పరుగులు సాధించింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 52 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 92 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కాన్వే సెంచరీ మార్కు మాత్రం అందుకోలేకపోయాడు.
Photo Credit : IPL Website
19.1: నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై
రవీంద్ర జడేజా రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి జడ్డూ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
Photo Credit : IPL Website
19 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు: 185/3
సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో డెవాన్ కాన్వే (91).
Photo Credit : IPL Website
16.1: మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
రాహుల్ చహర్ బౌలింగ్‌లో మొయిన్ అలీ(10) అవుట్.
Photo Credit : IPL Website
భారీ స్కోర్ దిశగా సీఎస్‌కే.. 15 ఓవర్లకు 146/2
130 పరుగులు వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన దుబే.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ(5), డెవాన్ కాన్వే(70) పరుగులతో ఉన్నారు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
86 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన గైక్వాడ్.. రజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి శివమ్ దుబే వచ్చాడు.
Photo Credit : IPL Website
6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 57/0
6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(30), కాన్వే(23) పరుగులతో ఉన్నారు.
Photo Credit : IPL Website
3 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 29/0
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే దూకుడుగా ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(14), కాన్వే(12) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2023లో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. పంజాబ్ మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. హర్‌ప్రీత్ బ్రార్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
సీఎస్‌కే
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
పంజాబ్ కింగ్స్
శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: Rohit Sharma: అనూహ్య పరిస్థితుల్లో సారథిగా.. కెప్టెన్‌గా పదేళ్లు.. ఏకంగా ఐదు ట్రోఫీలతో! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment