PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. డెవాన్ కాన్వే(52 బంతుల్లో 92), రుత్‌రాజ్ గైక్వాడ్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 200 పరుగులు చేసింది. కాన్వే, రుత్‌రాజ్ తొలి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చహర్, రజా, సామ్ కర్రాన్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌లోకి ఇంగ్లండ్ స్టార్ బౌలర్.. ఎవరంటే?
వారెవ్వా ధోని..
ఇక సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి ఫినిషర్ అవతరమెత్తాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన సామ్ కర్రాన్ బౌలింగ్‌లో తొలి బంతికే జడేజా ఔటయ్యాడు. అనంతరం ధోని క్రీజులో వచ్చాడు. రెండో బంతికి ఎటువంటి పరుగు రాలేదు.
అనంతరం మూడో బంతికి ధోని సింగిల్ తీసి కాన్వేకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి కాన్వే కూడా సింగిల్ తీసి ధోనికి స్ట్రైక్ ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను ధోని తనదైన సిక్సర్లగా మలిచాడు. ధోని సిక్స్‌లు కొట్టగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.
చదవండి: Rohit Sharma: గిల్‌క్రిస్ట్‌కే సలహాలు ఇచ్చేవాడు! కెప్టెన్ కావాలనుకున్నాడు.. కానీ! ఏదేమైనా వందకు వంద మార్కులు వేస్తా!
MS Dhoni is The Greatest Finisher of all the Time.pic.twitter.com/l4A8vNfW1t
— ` (@rahulmsd_91) April 30, 2023
Comments
Please login to add a commentAdd a comment