బట్లర్‌తో చహల్ (Photo Credit: Rajasthan Royals)
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: గతేడాది అత్యధిక వికెట్లు(27) తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్-2023లోనూ శుభారంభం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో చహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఉప్పల్ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.
రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(27), పవర్ హిట్టర్‌గా పేరొందిన హ్యారీ బ్రూక్(13) రూపంలో కీలక వికెట్లు తీసి రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన చహల్.. ఆఖర్లో ఆదిల్ రషీద్(18), కెప్టెన్ భువనేశ్వర్‌కుమార్ (6)లను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో చహల్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.
ఎవరికీ అందనంత ఎత్తులో
టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా యజువేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో 300కు పైగా వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్లకు అందనంత ఎత్తులో నిలిచాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అమిత్ మిశ్రాను వెనక్కి నెట్టిన చహల్.. లసిత్ మలింగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 300వ వికెట్ నమోదు చేసిన చహల్‌కు ఐపీఎల్‌లో ఇది 167వ వికెట్. ఇక రషీద్, భువీ వికెట్లు కూడా పడగొట్టి ఈ సంఖ్యలను 303, 170గా మార్చుకున్నాడు చహల్. అదే విధంగా సన్‌రైజర్స్‌పై రాజస్తాన్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా క్రికెటర్లు
►యజువేంద్ర చహల్- 303
►రవిచంద్రన్ అశ్విన్- 287
►పీయూశ్ చావ్లా- 276
►అమిత్ మిశ్రా- 272
►జస్‌ప్రీత్ బుమ్రా- 256.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు(ఇప్పటి వరకు)
1.డ్వేన్ బ్రావో- 183 వికెట్లు
2. యజువేంద్ర చహల్-170, లసిత్ మలింగ(శ్రీలంక)- 170 వికెట్లు.
చదవండి: మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి..
IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక..
The first Indian to 300 T20 wickets. 👏💗 pic.twitter.com/Q8PDmhHR4V
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023
Picked up where he left off in 2022. What a performance, Yuzi bhai! 💪💗 pic.twitter.com/t14Erw8ab5
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023
Comments
Please login to add a commentAdd a comment