రాజస్థాన్‌పై గుజరాత్‌ సంచలన విజయం | Sakshi
Sakshi News home page

IPL 2024, RR VS GT: రాజస్థాన్‌పై గుజరాత్‌ సంచలన విజయం

Published Wed, Apr 10 2024 7:07 PM

IPL 2024 Rajasthan Royals Vs Gujarat Titans Match Updates And Highlights - Sakshi

రాజస్థాన్‌పై గుజరాత్‌ సంచలన విజయం
రాజస్థాన్‌పై గుజరాత్‌ సంచలన విజయం సాధించింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓటమిపాలైంది. రాయల్స్‌ నిర్దిష్ట సమయానికి (వర్ రేట్‌లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్‌ ఓటమికి కారణమైంది.

చివరి ఓవర్‌లో గుజరాత్‌ గెలుపుకు 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ తక్కువగా ఉండటంతో గుజరాత్‌ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్‌లో గుజరాత్‌ బ్యాటర్లు సర్కిల్‌ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్‌ తెవాతియా (22), రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్‌ (35), శుభ్‌మన్‌ గిల్‌ (72) గట్టి పునాది వేశారు. కుల్దీప్‌ సేన్‌ (4-0-41-3), చహల్‌ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

చహల్‌ ఉచ్చులో ఇరుక్కున్న గిల్‌
చహల్‌ తెలివిగా వైడ్‌ వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడే క్రమంలో శుభ్‌మన్‌ గిల్‌ (720 స్టంప్‌ ఔటయ్యాడు. చహల్‌ తెలివిగా ప్లాన్‌ వేసి గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 15.2 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 133/5గా ఉంది. తెవాతియా, షారుక్‌ ఖాన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
111 పరుగుల వద్ద గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ (16) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 111/4గా ఉంది. గిల్‌ (52), తెవాతియా క్రీజ్‌లో ఉన్నారు.

నిప్పులు చెరుగుతున్న కుల్దీప్‌ సేన్‌
ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ సేన్‌ నిప్పులు చెరుగుతున్నాడు. 9వ ఓవర్‌లో తొలి వికెట్‌ తీసన సేన్‌.. 11వ ఓవర్‌లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. 11వ ఓవర్‌లో తొలుత వేడ్‌ను బౌల్డ్‌ చేసిన సేన్‌.. నాలుగో బంతికి అభినవ్‌ మనోహర్‌కు కూడా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
10.1 ఓవర్‌: వర్షం ఆగిపోయాక తొలి బంతికే మాథ్యూ వేడ్‌ (4) ఔటయ్యాడు. కుల్దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో వేడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

వర్షం అంతరాయం
10 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను పాక్షికంగా నిలిపివేశారు. ఈ సమయంలో జట్టు స్కోర్‌ 77/1గా ఉంది. మాథ్యూ వేడ్‌ (4), గిల్‌ (36) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవాలంటే 60 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
8.2 ఓవర్‌: 64 పరుగుల వద్ద గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ (35) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మాథ్యూ వేడ్‌ గిల్‌తో (28) జత కట్టాడు.

గేర్‌ మార్చిన గిల్‌
5 ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన గిల్‌.. ఆతర్వాత గేర్‌ మార్చి ఆడుతున్నాడు. 8 ఓవర్ల అనంతరం గుజరాత్‌ స్కోర్‌ 63/0గా ఉంది. గిల్‌ 35, సాయి సుదర్శన్‌ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

టార్గెట్‌ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్‌
197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 30/0గా ఉంది. సాయి సుదర్శన్‌ (19), శుభ్‌మన్‌ గిల్‌ (11) క్రీజ్లో ఉన్నారు. 

రియాన్‌, సంజూ మెరుపులు.. రాజస్థాన్‌ భారీ స్కోర్‌
రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

రియాన్‌ పరాగ్‌ ఔట్‌
18.4 ఓవర్‌: 172 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు క్యాచ్‌ ఇచ్చి రియాన​ పరాగ్‌ (76) ఔటయ్యాడు. 

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్‌
సంజూ శాంసన్‌ 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 162/2గా ఉంది. రియాన్‌ (68), శాంసన్‌ (58) క్రీజ్‌లో ఉన్నారు. 

రియాన్‌ పరాగ్‌ విధ్వంసం.. మరో మెరుపు హాఫ్‌ సెంచరీ
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో రియాన్‌ మరో మెరుపు అర్దశతకం బాదాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్దశతకాన్ని పూర్తి చేశాడు. రియాన​ హాఫ్‌ సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. 15 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 134/2. రియాన్‌ పరాగ్‌ (36 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (25 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌.. బట్లర్‌ను బోల్తా కొట్టించిన రషీద్‌ ఖాన్‌
5.5 ఓవర్‌: 42 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్‌ ఇచ్చి జోస్‌ బట్లర్‌ (8) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌..యశస్వి ఔట్‌
4.2 ఓవర్‌: 32 పరుగుల వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ (24) ఔటయ్యాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
దాదాపు అర్ద గంట తర్వాత టాస్‌ పడింది. గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం గుజరాత్‌ రెండు మార్పులు, రాజస్థాన్‌ ఓ మార్పు చేసింది. కేన్‌ విలియమ్సన్‌, బీఆర్‌ శరత్‌ స్థానాల్లో మథ్యూ వేడ్‌, అభినవ్‌ మనోహర్‌ గుజరాత్‌ తుది జట్టులోకి వచ్చారు. రాజస్థాన్‌ జట్టులో నండ్రే బర్గర్‌ స్థానంలో నవ్‌దీప్‌ సైనీ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నవ్‌దీప్‌ సైనీ

గుజరాత్‌ టైటాన్స్‌: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్‌ (వికెట్‌కీపర్‌), అభినవ్‌ మనోహర్‌, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్‌ జాన్సన్‌, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

టాస్‌ 7:25.. మ్యాచ్‌ 7:40కి ప్రారంభమయ్యే అవకాశం

వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్‌ రాయల్స్‌ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఢీకొట్టనుంది. రాయల్స్‌ సొంత మైదానమైన సువాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడయంలో (జైపూర్‌) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో రాయల్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్‌ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement