2025 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్ అందుతున్నాయి. మెగా వేలం నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు నవంబర్ 15ను డెడ్ లైన్‌గా విధించినట్లు సమాచారం.
రిటెన్షన్ నిబంధనలు ఈ నెలాఖరుకు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి వేలం భారత్‌లో కాకుండా విదేశాల్లో జరగవచ్చు. వేలానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సౌదీ అరేబియా మొగ్గు చూపుతుంది. ఈ విషయాలన్నిటినీ బీసీసీఐ ప్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేసినట్లు సమాచారం. గతేడాది మెగా వేలం దుబాయ్‌లో జరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ నిన్ననే తమ నూతన హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ పేరును ప్రకటించింది. గత సీజన్ వరకు పంజాబ్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్ పని చేశాడు. పేలవ ప్రదర్శనను కారణంగా చూపుతూ పంజాబ్ యాజమాన్యం బేలిస్‌ను తప్పించింది. పాంటింగ్ గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. పాంటింగ్ ఆ బాధ్యతల నుంచి ఇటీవలే తప్పుకున్నాడు. వచ్చే సీజన్ కోసం చాలా ఫ్రాంచైజీలు ఇప్పటికే హెడ్ కోచ్‌లకు మార్చాయి. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్ చేసింది.
చదవండి: పంజాబ్ కింగ్స్ రాత మారేనా!
Comments
Please login to add a commentAdd a comment