ఐపీఎల్‌లో రాబోయే మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (నవంబర్ 22) విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14న (శుక్రవారం) మొదలై మే 25న (ఆదివారం) ముగుస్తుంది. 2026 సీజన్ మార్చి 15న (ఆదివారం) మొదలై మే 31న (ఆదివారం) ముగుస్తుంది. 2027 సీజన్ మార్చి 14న (ఆదివారం) మొదలై మే 30న (ఆదివారం) ముగుస్తుంది.
కాగా, గతంలో ఐపీఎల్ షెడ్యూల్‌లను చివరి నిమిషంలో విడుదల చేసే వారు. అయితే ఆ ఆనవాయితీకి బీసీసీఐ స్వస్తి పలికి, ఒకేసారి మూడు సీజన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. అంతర్జాతీయ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా ఇది తోడ్పడుతుందని బీసీసీఐ తెలిపింది.
మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్..
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ఆర్చర్ 2025 సీజన్‌తో పాటు రానున్న మూడు సీజన్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించినట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్ 575వ ఆటగాడిగా జాయిన్ అవుతాడు. ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది.
మెగా వేలంలో ఆర్చర్‌తో పాటు మరో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అమెరికాకు చెందిన సౌరభ్ నేత్రావల్కర్, భారత్‌కు చెందిన హార్దిక్ తమోర్ వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిద్దరు 576, 577 నంబర్ ఆటగాళ్లుగా వేలం బరిలో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment