Asia Cup 2022: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో గనుక షాహిన్ పాల్గొంటే 14- 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేవాడని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించగల సత్తా ఉన్న బౌలర్ అంటూ పాకిస్తానీ యువ పేసర్‌ను కొనియాడాడు.
కీలక బౌలర్‌గా ఎదిగి!
2018లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షాహిన్ ఆఫ్రిది జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో 99, 32 వన్డేల్లో 62, 40 టీ20లలో 47 వికెట్లు తీసి సత్తా చాటాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాపై పాక్ గెలవడంలో షాహిన్ ఆఫ్రిది కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లు తీసి పాక్ విజయానికి బాటలు పరిచాడు.
ఇక గాయం కారణంగా ఆసియా కప్-2022 టోర్నీకి దూరమైన ఆఫ్రిది ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో.. ఆఫ్రిది సేవలు కోల్పోయామంటూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు జట్టులో అతడి పాత్ర ఏమిటో మరోసారి స్పష్టం చేశాయి.
వైరల్ అవుతున్న అశ్విన్ వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు ముందు తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అశూ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తానీ ఫాస్ట్‌బౌలర్లంతా సుమారు గంటకు 140- 145 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగలుగుతున్నారు.
నాకు తెలిసి ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టుకు కూడా పేస్ బెంచ్ ఇంత పటిష్టంగా లేదు. ఆ జట్టులో ప్రతిభ గల బౌలర్లకు కొదువలేదు. నా మదిలో ఎప్పుడూ ఓ క్రేజీ ఆలోచన మెదులుతూ ఉంటుంది. షాహిన్ ఆఫ్రిది ఒకవేళ ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎలా ఉంటుంది అని? ఈ లెఫ్టార్మ్ సీమర్ కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. డెత్ ఓవర్లలో యార్కర్లు సంధిస్తాడు.
నిజంగా తను గనుక వేలంలోకి వస్తే 14- 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఖాయం అనిపిస్తుంది. కీలక మ్యాచ్‌లో ఆఫ్రిది లేకపోయినా మిగతా వాళ్లు ఆ లోటు తీర్చగల సత్తా గలవారే’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో భారత జట్టుకు ఎంపికైన అశ్విన్‌కు మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు.
చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్‌ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు!
SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్
Comments
Please login to add a commentAdd a comment