నాగ్‌పూర్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య ప్రారంభమమైన తొలిటెస్టు తొలిరోజునే రసకందాయంలో పడింది. తొలిరోజు నుంచే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే చాప చుట్టేసింది.
ముఖ్యంగా జడేజా రీఎంట్రీ టెస్టులో ఐదు వికెట్లు తీసి కంగారూలను శాసించాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 11వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. మ్యాచ్‌లో 22 ఓవర్లు వేసిన జడ్డూ 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇందులో ఎనిమిది మెయిడెన్ ఓవర్లున్నాయి. దీంతో జడేజా ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కీలక సమయంలో మార్నస్ లబుషేన్, స్మిత్‌ల వికెట్లు తీసి టీమిండియాకు బ్రేక్ అందించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
వినూత్న హెయిర్‌స్టైల్‌తో మెరిసిన జడ్డూ..
ఇక ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన జడేజా హెయిర్‌స్టైల్ కొత్తగా అనిపించింది. జుట్టును మొత్తంగా వెనక్కి దువ్వి వెనుక పిలక వేయడం కాస్త ఢిపరెంట్‌గా అనిపించింది. దీంతో అభిమానులు జడ్డూ హెయిర్‌స్టైల్‌పై వినూత్న రీతిలో స్పందించారు. రీఎంట్రీ ఇచ్చిన జడ్డూ ఆటతో పాటు అతని తీరు కూడా కొత్తగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. 177 పరుగులకే ఆలౌట్
చరిత్ర సృష్టించిన అశ్విన్.. 18 ఏళ్ల కుంబ్లే రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment